సల్మాన్ ఖాన్ పెళ్లి రిపోర్ట్స్‌లో... కొత్త ట్విస్ట్!
పై న్యూస్ రిపోర్ట్స్‌పై ట్విస్ట్ ఇచ్చే కామెంట్ చేసారు సల్మాన్ తండ్రి. ఓ ప్రముఖ పత్రిక రొమేనియా భామతో సల్మాన్ పెళ్లి విషయమై తండ్రి సలీమ్‌ఖాన్‌ను ప్రశ్నించగా....'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆమెతో సల్మాన్ ఫెళ్లి వార్త కల్పితం మాత్రమే' అన్నారు.
'వృత్తి రీత్యా సల్మాన్ ఖాన్ ఎంతో మందిని కలుస్తుంటారు. లులియా కూడా కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరు. కేవలం స్నేహితురాలు మాత్రమే. వీరిమధ్య అంత సీరియస్ సంబంధం ఏమీ లేదు' అని స్పష్టం చేసారు సలీమ్ ఖాన్. గతంలో సల్మాన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినాను పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అనుకోని కారణాలతో వారి మధ్య బ్రేకప్ వచ్చింది.
ఏది ఏమైతేనేం, ఈ సారైనా సల్మాన్ పెళ్లి అవుతుందని ఆశ పడ్డ అభిమానులు......., అది జరుగడం లేదని తెలిసి కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. వయసు పరంగా రోజు రోజుకు ముదిరిపోతున్న సల్మాన్ ఈ జన్మలో అసలు పెళ్లి చేసుకుంటాడో? లేదో? కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications












