టిక్‌టాక్ భార్గవ్ కేసులో ట్విస్టులు.. వరుసగా లైవ్ లోకి వస్తున్న యువతులు !

టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ కేసులో తవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు అనే కారణంతో అతని మీద పోస్కో చట్టం విధించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.. అయితే రిమాండ్ కు తరలించిన అనంతరం భార్గవ్ గురించి అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.. గతంలో చాలా మంది యువతులను భార్గవ్ ఇలాగే ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

భార్గవ్ వలలో చాలామంది అమ్మాయిలు

భార్గవ్ వలలో చాలామంది అమ్మాయిలు

భార్గవ్ వలలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని మీడియా కధానాలు వెలువడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ అమ్మాయి పోలీసుల ముందుకు వచ్చి భార్గవ్ మోసం చేశాడని ఏ ఒక్కరూ కంప్లైంట్ ఇవ్వక పోయినా సరే భార్గవ్ ఫోన్ సీజ్ చేసిన పోలీసు అధికారులు అందులో చాలా మంది అమ్మాయిల కాంటాక్టులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ కుటుంబం విశాఖపట్నంలో స్థిరపడింది.. ముందు హైదరాబాద్ సినిమా అవకాశాల కోసం వెళ్ళిన భార్గవ అక్కడ కాస్త ఫేమ్ రాగానే విశాఖపట్నం తిరిగి వచ్చి ఇక్కడ టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు..

బాలిక తల్లిదండ్రులతో బేరసారాలు

బాలిక తల్లిదండ్రులతో బేరసారాలు

వచ్చిన క్రేజ్ తో చాలామంది అమ్మాయిలకు దగ్గరై అతను వారిని శారీరికంగా లొంగదీసుకున్నాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. టిక్ టాక్ లో అమ్మాయిలను స్టార్ చేస్తానని నమ్మబలికి తాను ఇప్పటికే టిక్ టాక్ లో స్టార్ ను కాబట్టి తనతో వీడియో చేస్తే మీరు కూడా ఫేమస్ అవుతారని ఆ అమ్మాయి లను భార్గవ్ వలలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నమోదైన కేసు విషయంలో కూడా కేసులు పెట్టవద్దని భార్గవ్ సదరు బాలిక తల్లిదండ్రులతో బేరసారాలు ఆడినట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండు లక్షలు ఇస్తాను కేసులు పెట్టవద్దని భార్గవ్ బాలిక తల్లిదండ్రులను కోరాడని అయితే తమ కుమార్తె జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు అని తెలుస్తోంది.

అన్నాచెల్లెళ్ల సంబంధం అని భావించి

అన్నాచెల్లెళ్ల సంబంధం అని భావించి

ముందు సదరు బాలిక భార్గవ్ ను అన్న అని సంబోధించడం అని భార్గవ్ కూడా ఆమెను చెల్లి అని సంబోధించడంతో తల్లిదండ్రులు వారిద్దరిదీ అన్నాచెల్లెళ్ల సంబంధం అని భావించి పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం ఇంత దాకా వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో భార్గవ తో వీడియోలు చేసిన యువతులు ఒక్కొక్కరుగా లైవ్ లోకి వచ్చి తమకు ఈ వ్యవహారానికి సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు. నిన్న నిత్యశ్రీ లైవ్ లోకి వచ్చి తనకు భార్గవ్ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇవ్వగా తాజాగా మౌనిక అనే మరో యువతి కూడా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి తాము ఇద్దరం కలిసి రెండున్నరేళ్లు అవుతుంది అని తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన ఫోటోలు వాడవద్దని కోరింది.

Recommended Video

Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
లైవ్ లోకి మరో యువతి

లైవ్ లోకి మరో యువతి

గతంలో భార్గవ్ - మౌనికలు అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు రిలీజ్ చేసి టిక్ టాక్ వేదికగా విడుదల చేసేవారు. అయితే దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నుంచి వీరిద్దరూ కలిసి వీడియోలు అయితే చేయడం లేదు. కానీ యూట్యూబ్ ఛానల్ లు, వీరిద్దరి పేర్లతో ఫోటోలతో వీడియోలు పెడుతూనే ఉండడంతో ఆ అమ్మాయి ఇప్పుడు లైవ్ లోకి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ ముందుకు వెళుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క యువతి కూడా భార్గవ్ తమను మోసం చేసినట్లు కంప్లైంట్ అయితే ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ ఫిర్యాదు అందితే ఏం చేయాలి అనే దాని మీద పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నమోదయింది పోస్కో చట్టం కాబట్టి భార్గవ్ కు కఠినమైన శిక్షలు అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X