»   » శ్రీమంతుడు: మహేష్ బాబు ఆయుధం కొత్తగా ఉందే..(ఫోటోస్)

శ్రీమంతుడు: మహేష్ బాబు ఆయుధం కొత్తగా ఉందే..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లు ప్రతి రోజూ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లలో మహేస్ బాబు సరికొత్త ఆయుధంతో కనిపించారు. నట్ బోల్ట్స్ తరహాలో ఈ ఆయుధం ఉండటం గమనార్హం.

ఈచిత్రం ఈ నెల 31న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.


జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.


మహేష్ బాబు
  

మహేష్ బాబు

శ్రీమంతుడు సినిమాలో కొత్త ఆయుధంతో మహేష్ బాబు.


లుక్ సూపర్
  

లుక్ సూపర్

మహేష్ బాబు లుక్ ఈ సినిమాలో గత సినిమాల కంటే భిన్నంగా, కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉండటం గమనార్హం.


సూపర్ రెస్పాన్స్
  

సూపర్ రెస్పాన్స్

ఇప్పటి వరకు విడుదలైన మహేష్ బాబు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


హిట్టు ఖాయం
  

హిట్టు ఖాయం

శ్రీమంతుడు సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.


Please Wait while comments are loading...