బికినీలో కియారా అద్వాని రచ్చ రచ్చ.. సముద్ర అడుగుభాగంలో
బాలీవుడ్ హీరోయిన్లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కోసం హలీడే ట్రిప్‌కు వెళ్లిన తారలు వేడుకల్లో మునిగిపోయారు. దిషా పటానీతోపాటు పలువురు బికినీ ధరించి హాట్ హాట్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా అదే మూడ్‌లోకి భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వాని కూడా చేరిపోయారు. బికినీ ధరించి హంగామా చేస్తున్నారు. ఓ సారి మీరే లుక్కేయండి..

బీచ్ హాలీడేలో కియారా అద్వానీ
బీచ్ హాలీడేలో భాగంగా కియారా అద్వానీ ఏదో ఐలాండ్ కంట్రీకి వెళ్లినట్టు స్పష్టమైంది. బికినీ ధరించి మధురు క్షణాలను ఆస్వాదిస్తున్నది. బికినీలో ఉన్న ఆమె వెనుక భాగాన్ని చూపించి అభిమానులకు పండుగలాంటి క్షణాలను అందించింది.

సముద్ర అడుగు భాగంలో
బికినీ అందాలతో ఆగకుండా సముద్ర అడుగు భాగంలో ఈదుతూ కనిపించింది. ఫైండింగ్ నెమో అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. సముద్ర అడుగు భాగంలో జల విహారం చేస్తున్న వీడియోను తన ఇన్‌ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఊయలలో సేద తీరుతూ కొత్త సంవత్సరానికి
అంతేకాకుండా సముద్రం తీరాన ఊయ్యాలలో సేద తీరుతూ కనిపించింది. కియారా ఫుల్ జోష్‌లో 2018 గుడ్‌బై చెబుతూ.. 2019 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నట్టు అర్ధమైంది.
వినయ విధేయ రామ చిత్రంతో
ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. రాంచరణ్ సరసన హాట్ హాట్‌గా కనిపించపోతున్నది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











