ఎంఎం శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్
ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆల్బం రూపొందించారు. ''తొలి అడుగైన, తొలి వలపైనా... జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం'' అంటూ సాగే ఈ పాట....కొత్త సంవత్సరంలో తొలి రోజును ఎన్నో ఆనందాలతో ప్రారంభించాని యువతను ఉత్సాహ పరుస్తోంది. రచయిత సిరాశ్రీ ఈ గీతాన్ని రచించగా...శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ....ఈ ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ ఆల్బం విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎప్పటినుండో ఓ ప్రైవేటు ఆల్బం రూపొందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికి తన ఆలోచన కార్యరూపం దాల్చింది చెప్పుకొచ్చారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్షతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఎంఎం. శ్రీలేక శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సర్కారీ గుండా' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











