నా కథ కాపీ కొట్టారు...
క్రితం శుక్రవారం రిలీజ్ అయిన న్యూ యార్క్ చిత్రం ఓ కొత్త కాంట్రవర్సీ కి తెర లేపింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పతాకం పై ఆదిత్య చోప్రా ఈ చిత్రం నిర్మించారు. కబీర్ ఖాన్ దర్శకుడు. జాన్ అబ్రహమ్, కత్రినా కైఫ్, నీల్ నితిన్ ముఖేశ్, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రధారులు. విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ వివాదం తలెత్తింది. ఈ చిత్ర కథ తాను 2006లోనే సిద్ధం చేశానని, అది ఆదిత్య చోప్రాకి వినిపించడానికి వెళితే..తన దగ్గరున్న మరో దర్శకుడు అర్జున్ సబ్‌లోక్‌కి కథాగమనాన్ని వివరించమని ఆది చెప్పారని రచయిత, దర్శకురాలు సుచితా భాటియా ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు 1, 2006న యశ్ రాజ్ స్టూడియోలో అర్జున్ కి తను కథ వినిపించినట్లు ఆమె చెబుతున్నారు. మూడేళ్లు తన పని మీద తానున్నానని, ఇంతలో అదే కథతో 'న్యూయార్క్' చిత్రాన్ని తీసేశారని ఆమె ఆరోపిస్తున్నారు. దీని గురించి దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ ఆమెదని చెప్పడంలో అర్థం లేదు. ఎందుకంటే సందీప్ శ్రీవాత్సవకు కథ అందించినందుకు ఆదిత్య చోప్రా పారితోషికం కూడా చెల్లించారు. ఆమె కథ చెప్పినట్త్లెతే ఆ ఇచ్చేదేదో ఆమెకే ఇచ్చేవారు కదా! అయినా ఒక సినిమా విజయం సాధించిందంటే ఇలాంటి వాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటారని కొట్టిపారేశారు. ఇంతకి ఏది నిజమో ఏది అబద్దమో తెలనే లేదు.


Click it and Unblock the Notifications











