»   »  పోర్న్‌స్టార్ నుంచీ దైవసన్నిధి వరకూ : ఆ జీవితం ఒక విషాదం

పోర్న్‌స్టార్ నుంచీ దైవసన్నిధి వరకూ : ఆ జీవితం ఒక విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాడియా హిల్టన్ ఈ పేరు చాలామందికే తెలుసు పోర్న్ సినిమాలు చూసే అలవాటున్న వాళ్ళకి రెండో సారి చెప్పె అవసరం కూడా లేదు. ఒక ప్పటి నీలిచిత్ర పరిశ్రమలోనే ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్. సంవత్సరానికి ఆమె సంపాదన 20 కోట్ల పైమాటే. అసలు పేరు క్రిస్టల్‌ బస్సెట్టె అయినా నాడియా అనే పేరు తోనే పాపులర్ అయిందీ భామ. ఇప్పుడు ఎవరూ ఊహించలేని నిర్ణయం తీసుకొని ఆమె అభిమానులందరికీ పేద్ద షాక్ ఇచ్చింది. కొణ్ణాళ్ళక్రితం జరిగిన కారు ప్రమాదం లో మృత్యువు అంచువరకూ వెళ్ళి వచ్చిన ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే....!

గుండేలను పిండేసే విషాదం

గుండేలను పిండేసే విషాదం

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని తన పోర్న్ చిత్రాలతో అలరించిన ఈ నటి హఠాత్తుగా అన్నీ వదిలేసి మతభోదకురాలిగా మారిపోయింది. నిజానికి బ్రస్సెట్టే పోర్న్ స్టార్ గా మారటానికీ, ఆతర్వాత ఇప్పుడు దేవసేవకే అంకితమైపోవటానికీ వెనుక రెండు గుండేలను పిండేసే విషాద గాథలున్నాయి....

లైంగిక దాడికి గురై

లైంగిక దాడికి గురై

చిన్న తనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె పదహారేళ్లకే గర్భం దాల్చింది. తన కుమారుడు జస్టిన్‌ కు అండగా నిలవాలనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలివుడ్‌కు మకాం మార్చింది. ముందుగా మోడలింగ్‌, తర్వాత డబ్బు కోసం బార్లలో డ్యాన్సులు కూడా చేసింది.

పోర్న్ చిత్రంలో

పోర్న్ చిత్రంలో

ఓ అడల్ట్‌ చిత్ర ఏజెంట్‌ అమెను సంప్రదించి పోర్న్‌ మూవీల్లో నటించడానికి అవకాశం కల్పించాడు. నెలకు రూ.20 లక్షలు సంపాదించే అవకాశం దొరకడంతో వెనకాముందు చూసుకోకుండా ఓకే చెప్పేసింది.,,అనంతరం కొద్ది రోజుల్లోనే మలిబు హౌస్ లో తొలిసారి పోర్న్ చిత్రంలోని ఓ సన్నివేశంలో నటించింది.

పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో

పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో

'ఆ రోజు తొలిసారి పోర్న్ లో నటించిన తర్వాత షవర్‌ కింద దాదాపు రెండు గంటలు కూర్చొని ఏడవడం నాకు ఇంకా గుర్తుంది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత నెల వరకు మరో షూటింగ్‌కు వెళ్లలేదు. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో స్పర్శలేకుండా ఉండటానికి మద్యం సేవించడం, పెయిన్‌ లెస్‌ మెడిసిన్ లు వాడటం ప్రారంభించాను' అని తన చీకటి రోజులను బస్సెట్టె గుర్తు చేసుకుంది.

 నాడియా హిల్టన్ పేరుతో

నాడియా హిల్టన్ పేరుతో

ఆ తర్వాత నాడియా హిల్టన్ పేరుతో అనేక పోర్న్ చిత్రాలలో నటించిన బస్సెట్టె కొద్దికాలంలోనే పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సంపాదించిన డబ్బుతో మలీబుూలోనే అత్యంత విలాసవంతమైన భవంతి, ఖరీదైన ఫెరారీ కారుతోపాటు మరో ఆరు కార్లు కూడా కొనేసింది. విలాసంతమైన జీవితాన్ని గడిపింది

చర్చిలో మతబోధకురాలిగా

చర్చిలో మతబోధకురాలిగా

ఒక్క సంఘటనతో వీటన్నిటిని వదిలేసింది. ఓ చిన్న టౌన్‌ ఫాల్టన్ లోని చర్చిలో మతబోధకురాలిగా మారింది ఈ ఒకప్పటి ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టల్‌ బస్సెట్టె. అయితే ఒక్క ధారుణమైన కారు ప్రమాదం ఆమె ఆలోచననే మార్చేసింది. ఈ ప్రమాదంతో మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె తాను ఎవరికోసం బతుకుతోందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.

 పోర్న్ స్టార్ జీవితానికి ముగింపు

పోర్న్ స్టార్ జీవితానికి ముగింపు

ఆ సమయంలో తన పోర్న్ స్టార్ జీవితానికి ముగింపు పలికి, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారితో కలిసి ఉండడం ప్రారంభించింది. ఒకరోజు చర్చిలో తన సోదరి వివాహానికి హాజరైన సమయంలో బస్సెట్టె పాస్టర్ డేవిడ్ ను కలుసుకుంది. తరచూ తన సోదరితో కలిసి చర్చికి వెళుతుండడంతో ఆమె గత జీవితం కూడా ఆయనకు తెలిసింది.

ఆమె గతాన్ని పట్టించుకోకుండా

ఆమె గతాన్ని పట్టించుకోకుండా

అయితే ఆమె గతాన్ని పట్టించుకోకుండా పాస్టర్ డేవిడ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత వారిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. భర్త డేవిడ్ సహకారంతో ఆమె పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంది. ఇద్దరూ కలిసి ఓ చర్చిని సొంతంగా నిర్మించి అక్కడే కొత్త జీవితం ప్రారంభించారు.కారు ప్రమాదం నుంచి బయటపడడం అనేది దేవుడు నాకిచ్చిన పునర్జన్మగా నేను భావించాను.

పేదలకు సహాయం చేయడం

పేదలకు సహాయం చేయడం

ప్రస్తుతం నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో నేను ఆలోచించడం లేదు. డబ్బు సంపాదనపై అసలు నా దృష్టి లేదు. పేదలకు సహాయం చేయడం, మంచి వాక్యాలు బోధించడంపైనే నా దృష్టి అంతా..'' అంటోంది బస్సెట్టె. ఎవరి జీవితం ఎప్పుడు ఏమలుపు తీసుకుంటుందో ఎవరు చెప్పగలరు. ఇప్పుడు బ్రస్సెట్టే తన తర్వాతి జీవిత్తాన్నైనా ప్రశాంతంగా గడుపుతుందో లేదో చూడాలి

English summary
here is the tale of Nadia Hilton, once a porn star , who was making $300k a year shooting porn who quit it after the pain of getting through a scene was too much. She ended up marrying a pastor and quitting the industry. To each their own and may each person find the happiness they want.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu