twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలసానిని కలిసిన ‘మా’ కొత్త కార్యవర్గం, 22న ప్రమాణ స్వీకారం

    |

    కొత్తగా ఎన్నికైన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) కార్యవర్గం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తలసాని కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. చిరంజీవిగారు 'మా' ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు. కొత్త అధ్యక్షుడు నరేష్ సారథ్యంలో మరిన్ని మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

    భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది నటీనటులకు సహాయం అందించాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు జరుపాలని, తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు 'మా'కు అందిస్తుందని, మార్చి 22న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తానూ భాగస్వామ్యం అవుతానని తలసాని తెలిపారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్: మరింత వేడి పెంచిన వర్మ... చంద్రబాబు- బాలయ్య వీడియో వైరల్!లక్ష్మీస్ ఎన్టీఆర్: మరింత వేడి పెంచిన వర్మ... చంద్రబాబు- బాలయ్య వీడియో వైరల్!

    Newly elected MAA panel met minister Talasani Srinivas Yadav

    నరేష్ మాట్లాడుతూ... ఇటీవల 'మా' ఎన్నికల్లో విజయం నైతిక విజయం. మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సభ్యులంతా మమ్మల్ని నమ్మి గెలిపించి మరింత ప్రోత్సహించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సంతోష పెడుతూ, పేదల ప్రభుత్వంగా నిలబడటంతో పాటు కృష్ణ దేవరాయల ప్రభుత్వం మాదిరిగా కళాకారులకు, కళలకు పెద్ద పీఠ వేశారు.

    సినీ పరిశ్రమ మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి 30 సంవత్సరాల సమయం పట్టింది. ఎటువంటి భయం లేకుండా షూటింగులు, స్టూడియోలు కళకళలాడుతున్నాయి. ఇంత బాగా పాలిస్తున్న కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా పరిశ్రమకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారని నరేష్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పాటు 'మా' తరుపున వివిధ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

    English summary
    Newly elected Movie Artists Association (MAA) President Naresh and panel members met Telangana cinematography minister Talasani Srinivas Yadav.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X