వెంకీ ‘బాడీగార్డు’ కూడా అదే పోకడ?
విక్టరీ వెంకటేష్ హీరోగా బాడీగార్డు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్. ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిస నటిస్తోంది. నిర్మాత బెల్లకొండ సురేష్ సంక్రాంతి కానుకగా వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
మలయాళ, హిందీ వెర్షన్లు చూస్తే ఎక్కువ యాక్షన్ నేపథ్యం సాగుతుంది. అయితే తెలుగు బాడీగార్డు సినిమా మాత్రం దర్శకుడు గోపీచంద్ మలినేని వెంకటేష్ ఇమేజ్ కు తగిన విధంగా మలిచాడని అంటున్నారు. గతంలో వెంకీ హీరోగా వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాల్లో మాదిరి వెంకీ కామీడి యాక్షన్ పోకడ 'బాడీగార్డు' సినిమాలో సాగుతుందని అటున్నారు. అదే విధంగా యాక్షన్ సన్నివేశాల్లోనూ వెంకటేష్ అదరగొట్టాడని సినిమా యూనిట్ వర్గాల ఇన్ సైడ్ టాక్.
ఏ హీరో సినిమా అయినా సరే...విడుదల ముందు ఇలాంటి ఊహాగానాలు, అంచనాలు సర్వసాధారణమే. మరి బాడీగార్డుగా వెంకీ ఈ అంచనాలు అందుకుంటారో? లేదో మరికొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











