twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా గందరగోళమే..రాంచరణ్ కు అనుభవం లేకేనా..!

    |

    మెగా స్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాక ఖైదీ నెం 150 తో ఘనమైన ఎంట్రీ ఇచ్చారు. రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం మెగాస్టార్ కు 150 వ మూవీ. 151 వ చిత్రంగా చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రని సైరా నరసింహారెడ్డిగా ఆవిష్కరించబోతున్నాడు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. రాంచరణ్ స్వయంగా కొణెదల ప్రొడక్షన్ కంపెనీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నా అన్ని అనుకున్నట్లు జరగడం లేదని టాక్. నటీనటులు ఇతర టెక్నీషియన్ల విషయంలో మెగా కాంపౌండ్ ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది.

    స్టార్ కాస్టింగ్, అంతకు మించిన బడ్జెట్

    స్టార్ కాస్టింగ్, అంతకు మించిన బడ్జెట్

    చిరు కెరీర్ లో ఎలాగైనా సైరా చిత్రాన్ని ఓ మెమరబుల్ మూవీగా మార్చాలని రాంచరణ్ భావిస్తున్నాడు. బెస్ట్ యాక్టర్లు, టెక్నీషియన్ల ఎంపిక పై దృష్టి సారించాడు. ఇప్పటికె ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. కానీ కొన్ని కీలక విషయాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో రాంచరణ్ ఒత్తిడికి గురి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    రంగంలోకి పరుచూరి బ్రదర్స్

    రంగంలోకి పరుచూరి బ్రదర్స్

    ఈ చిత్ర స్క్రిప్ట్ విషయంలో చిరంజీవికి ఇంకా కొన్ని అనుమానాలు ఉండడంతో తనకు అచొచ్చిన పరుచూరి బ్రదర్స్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కథ పూర్తి కాకముందే షూటింగ్ మొదలు పెట్టారనే అనుమానాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి.

     హీరోయిన్ ఎవరు

    హీరోయిన్ ఎవరు

    సైరా మొదలైనప్పటి నుంచి చిత్ర యూనిట్ ని వేధిస్తున్న ప్రశ్న ఇదే. చరిత్రకు సంబందించిన చిత్రం కావడంతో కథకు తగ్గట్లుగానటించే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. మొదట ఐశ్వర్యారాయ్ పేరు వినిపించింది. ఆ తరువాత నయనతార ఖాయం అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు మెగాస్టార్ జోడి మాత్రం ఖరారు కాలేదు.

     మ్యూజిక్ మ్యాజిక్ చేసేది ఎవరు

    మ్యూజిక్ మ్యాజిక్ చేసేది ఎవరు

    సైరా టీంని గందరగోళంలో పడేసిన మరో అంశం సంగీత దర్శకుడు ఎవరని. హీరోయిన్ విషయంలో నెలకొన్న డైలమా తరహాలోనే సంగీత దర్శకుడి విషయంలో కూడా డైలమా నెలకొని ఉంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు సంగీతం చాలా కీలకమైన అంశం. ఏఆర్ రెహమాన్ దాదాపు ఖాయం అనుకున్న నేపథ్యంలో అతడు హ్యాండ్ ఇచ్చాడు. ఆ తరువాత కీరవాణి అని అన్నారు. కాదు కాదు థమన్ అని కూడా వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఇళయరాజా పేరు వినిపిస్తోంది.

    మెగాస్టార్ ఓటు ఆయనకే

    మెగాస్టార్ ఓటు ఆయనకే

    సైరా చిత్ర యూనిట్ సంగీత దర్శకుడి వేటలో ఉంటె, చిరంజీవి మాత్రం ఇళయరాజా పేరు సిఫారసు చేస్తున్నారట. ఆయనైతే ఈ చిత్రానికి తగ్గ సంగీతాన్ని అందించగలరని చిరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    రాంచరణ్ కు అనుభవం లేకేనా

    రాంచరణ్ కు అనుభవం లేకేనా

    చిత్ర నిర్మాణం విషయంలో రాంచరణ్ కు అనుభవం లేకపోవడం వల్లనే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నటీ నటులతో, టెక్నీషియన్లతో మాట్లాడి ఒప్పించడంలో నిర్మాత పాత్ర కూడా ఉంటుంది. సైరా విషయంలో తలెత్తుతున్న సమస్యలు చరణ్ అనుభవ రాహిత్యం వల్లే అంటూ ప్రచారం జరుగుతోంది.

    English summary
    News is going viral regarding Sye Raa Narasimhareddy movie music director. Ilayaraja will going to handle this project as per that news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X