న్యూస్ మేకర్ 2017: బాక్సాఫీస్ బొనాంజా.. జై బాలయ్య
నటరత్న, విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టిన బాలకృష్ణ తన కెరీర్‌లో 100వ చిత్రాన్ని పూర్తి చేసుకొన్నాడు. 100వ చిత్రంగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఘనవిజయాన్ని అందించింది. ఆ తర్వాత 101వ చిత్రంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం పెద్దగా కమర్షియల్ హిట్ కాకపోయినా నటుడిగా కొత్త కోణంలో కనిపించాడు అనే మాట వినిపించింది.
Recommended Video

తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందిస్తున్న జై సింహా అనే చిత్రంలో నటిస్తున్నాడు. జై సింహా చిత్రం బాలకృష్ణకు 102వ చిత్రం. ఈ చిత్రంలో నయనతారతోపాటు మరో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

ఇక జై సింహ తర్వాత వరుస చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకొన్నాడు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో, అలాగే బోయపాటి డైరెక్షన్‌లో మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ చిత్రంలో సినిమాలో నటించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అలాగే ఎమ్మెల్యేగా కూడా ప్రజా జీవితంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఈ ఏడాది టాలీవుడ్ న్యూస్ మేకర్లలో బాలకృష్ణ ఒకడిగా నిలిచాడు.


Click it and Unblock the Notifications











