న్యూస్ మేకర్ 2017: విజయాలతో నాని అష్టాచెమ్మా
Recommended Video

టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. నాని అసలు పేరు గంటా నవీన్. అష్టాచెమ్మా అంటూ కెరీర్‌ను అలా మొదలుపెట్టిన నాని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. పిల్లా జమీందార్, ఈగ, ఎవడే సుబ్రమణ్యం చిత్రాలు నానిని హీరోగా నిలబెట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రంతో మరోమెట్టు ఎక్కిన నాని ఇటీవల కాలంలో వరుసగా ఏడు హిట్లను సొంతం చేసుకొన్నాడు. దాంతో 2017లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగానే కాకుండా ఓ న్యూస్ మేకర్‌గా మారాడు.
గతంలో అష్టాచెమ్మా, భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మన్, జ్యో అచ్యుతానంద, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి లాంటి ఘనవిజయాలను తన కెరీర్‌లో జమచేసుకొన్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు రూపొందిస్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఎంసీఏ చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే అభిప్రాయన్ని సినీవర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











