న్యూస్ మేకర్ 2017: తెలంగాణ పోరీగా ఫిదా చేసిన సాయి పల్లవి..
టాలీవుడ్‌లో మెరుపులా దూసుకొచ్చిన యువ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మలయాళ చిత్రం ప్రేమమ్‌లో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకొన్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. టెలివిజన్ రియాలిటీ షో ఢీలో తన డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన తారగా మారిపోయింది.
Recommended Video

తెలంగాణ యాసతో తెలుగు ప్రజలను మైమరిపించే విధంగా మాట్లాడటమే కాకుండా.. డ్యాన్యులు, హావభావాలతో ఇరుగదీసింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వరుసగా రెండవ చిత్రంలో కూడా నటిస్తున్నది. నానితో కలిసి ఎంసీఏ చిత్రంలో నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. విడుదలకు ముందే ఈ చిత్రంలో సాయిపల్లవి నటనపై ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు.

ఇక తమిళ చిత్ర కరుల్ కణమ్ రీమేక్‌గా వస్తున్న కణంలో నాగశౌర్యతో జతకట్టింది. ధనుష్ నటిస్తున్నా మారి2 చిత్రంలో నటిస్తున్నది. విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ పలు అవార్డులను, ప్రేక్షకుల ప్రశంసలందుకొని 2017 సంవత్సరంలో వార్తల్లో వ్యక్తిగా మారింది. ఈ ఏడాది టాలీవుడ్ న్యూస్ మేకర్లలో ఒకరుగా నిలిచింది.


Click it and Unblock the Notifications











