ఇక నుంచి ధియోటర్లలో అవి పడాల్సిందే..లేకుంటే శిక్షే
ఇక నుంచి సినిమా చూడాలంటే ముందుగా థియేటర్లలో న్యూస్‌రీళ్ళు, డాక్యుమెంటరీలు తప్పనిసరిగా చూడాల్సిందే. వీటిని ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు న్యూస్‌రీళ్ళు తప్పనిసరిగా ప్ర దర్శించాలని సమాచార శాఖ కమిషనర్ పార్ధసారథి ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రదర్శనకు గతంలో నిబంధనలు ఉన్నా థియేటర్ల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన న్యూస్‌రీళ్ళు, డాక్యుమెంటరీలు డబ్బాలలోనే మగ్గుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోడ్చి ఫిలిండివిజన్ వీటిని ప్రతి ఏటా రూపొందిస్తున్నది. సినిమా తర్వాత జనగణమనను కూడా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. అంటే మళ్ళీ పాతరోజులు వస్తాయన్నమాట. గుడ్..
రోశయ్య జనగనమణ ప్రభుత్వం న్యూస్ రీళ్ళు డాక్యుమెంటరీ rosaiah pardha sarathi newsreels documentaries theater government


Click it and Unblock the Notifications