నటికి కావల్సిన లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టే నేనే నంబర్ వన్ అవుతా..

By Nageswara Rao

''నాగవల్లి"లో బాగా యాక్ట్ చేశారు. కంగ్రాట్స్ అని అభినందించి నన్ను ప్రోత్సహిస్తున్నారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా అంటున్న మాటలివి"" అని రిచా గంగోపాధ్యాయ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'లీడర్" చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఆమె నటించిన తదుపరి చిత్రం 'నాగవల్లి".

'చంద్రముఖి"లో జ్యోతిక చేసిన పాత్రను ఈ చిత్రంలో రిచా చేశారు. తను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ పాత్ర చేయడం సులువైందట. ఆ విషయం గురించి రిచా చెబుతూ - ''నా తొలి చిత్రం 'లీడర్"లో డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లభించలేదు. ఆ కొరతను కొంతవరకు 'నాగవల్లి" తీర్చింది. డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో ఈ పాత్రను ఎంతో ఇష్టంగా అంగీకరించాను. 'గౌరి" పాత్రలో మీరు పూర్తిగా ఒదిగిపోయారని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది"" అన్నారు. రవితేజ సరసన ఆమె నటించిన 'మిరపకాయ్" త్వరలో విడుదల కానుంది. రానా హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా రిచా గంగోపాధ్యాయ కమిట్ అయ్యారు.

'లీడర్" తర్వాత మళ్లీ రానా, రిచా నటించబోతున్న చిత్రం ఇది. ఇదిలా ఉంటే హీరోయిన్ కాకపోయి ఉంటే రిచా 'న్యూట్రిషనిస్ట్" అయ్యేవారు. ఆ విషయం గురించి చెబుతూ - ''మిశ్చిగన్ యునివర్శిటీలో న్యూట్రిషన్ కోర్స్ చేశాను. ఇప్పుడు మాత్రం సినిమా కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నాను. గొప్పలు చెబుతున్నానని భావించకపోతే కొన్ని విషయాలు చెప్తా. కచ్చితంగా కొన్నేళ్లపాటు ఇక్కడ తిరుగులేని తారగా వెలుగుతాననే నమ్మకం ఉంది. ఒడిస్సి, కథక్, ఫోక్ డాన్స్, సాల్సా, హిప్ హాప్ డాన్స్‌లు తెలుసు. వయొలిన్ ప్లే చేస్తాను. పాటలు పాడటం వచ్చు. ఎలాంటి పాత్ర అయినా చేయగల ప్రతిభ ఉంది. ఒక నటికి కావల్సిన లక్షణాలు నాలో చాలావరకు ఉన్నాయి కాబట్టే ఈ నమ్మకాన్ని వ్యక్తపరిచాను"" అన్నారు రిచా గంగోపాధ్యాయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X