twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య ‘NGK’ ట్విట్టర్ రివ్యూ: పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..?

    |

    7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు లాంటి అద్భుతమైన సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తంపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వర్ణ' ప్లాప్ కావడంతో ఐదేళ్లగా తెరమరుగైపోయాడు. ఎట్టకేలకు అతడు సూర్య హీరోగా NGK సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

    పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లు. ట్రైలర్, టీజర్‍‌ రిలీజైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మే 31న గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే యూఎస్ఏ, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. కొందరు అభిమానులు ట్విట్టర్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

    ఫెంటాస్టిక్ మూవీ

    NGK ఫెంటాస్టిక్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రతీ సీన్ దర్శకుడు సెల్వరాఘవన్ అద్భుతంగా రూపొందించారు. సూర్య అన్న, రకుల్ ప్రీత్, సాయి పల్లవి తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. సూర్య బ్రదర్ ఎమోషనల్ సీన్ అద్భుతం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం.

    సూర్య యాక్టింగ్ బావుంది కానీ...

    NGK యావరేజ్ మూవీ. సూర్య యాక్టింగ్ బావుంది కానీ మేకింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. సెల్వ ఏదో మిస్ చేసిన ఫీలింగ్ కలుగుతోంది. నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యానంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

    సెకండాఫ్ డిసప్పాయింటెడ్

    NGK డిసెంట్ మూవీ. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సూర్య నటనలో కొత్తకోణం కనిపించింది. అయితే సెకండాఫ్ కాస్త డిసప్పాయింట్ చేసింది. కానీ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ టిపికల్ సెల్వరాఘవన్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగించింది. చీఫ్ మినిస్టర్, రకుల్ ప్రీత్ సింగ్ సీన్ కన్ ఫ్యూజింగ్ గా ఉంది. మార్కెట్ స్టంట్ డిఫరెంటుగా ఉంది. సూర్య, సాయి పల్లవి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.

    టాప్ నాచ్

    ఇంటర్వెల్ సీన్ చాలా బావుంది. సూర్య యాక్టింగ్, యువన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సెల్వరాఘవన్ డైలాగులు టాప్ నాచ్ అనేలా ఉన్నాయి.

    ఫస్టాఫ్ బావుంది

    NGK ఫస్టాఫ్ బావుంది. సాధారణమైన పొలిటికల్ స్టోరీ కానీ సెల్వ యునిక్ మేకింగ్ స్టైల్ ఆకట్టుకుంది. సూర్య పెర్ఫార్మెన్స్ అదరిపోయింది.

    ఇలాంటి సినిమా ఊహించలేదు

    ఫస్టాఫ్ బిలో యావరేజ్ అనేలా ఉంది. సెల్వరాఘవన్ నుంచి ఇలాంటి లేజీ స్క్రీన్ ప్లే మూవీ ఊహించలేదు. ఆయన పనితీరు నచ్చలేదు. రైటింగ్, ప్రజంటేషన్ పరంగా ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటిలోకెల్లా వీకెస్ట్ మూవీ ఇదే.

    దీన్ని వాళ్లే చెడగొట్టినట్లు ఉంది

    సెల్వరాఘవన్ ఒక కల్ట్ మూవీ తీయాలనుకున్నాడు. కానీ సూర్య, ప్రభు టీం కథను వీక్ చేసినట్లు స్పష్టం అవుతోంది. సినిమాకు యూ సర్టిఫికెట్ రావడమే ఇందుకు నిదర్శనం.

    కొత్త లీడర్ పుట్టాడు

    NGK ఫస్టాప్ బావుంది. సూర్య పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఒక కొత్త లీడర్ పుట్టాడనే అనుభూతి కలిగింది.

    ఫస్టాఫ్ వాచబుల్, సెకండాఫ్ హారబుల్

    NGK మూవీ విషయంలో చాలా మంది తొలి భాగంపై సంతృప్తిగా ఉన్నారు. సెకండాఫ్ హారబుల్‌గా ఉంది అనే అభిప్రాయాలు చాలా మంది నుంచి వ్యక్తం అవుతున్నాయి.

    కొంత మందికి బుర్రలేదు

    NGK మూవీ గురించి చాలా మంది నెగెటివ్‌గా స్పందించడం కనిపిస్తోంది. వారికి బుర్రలేదని స్పష్టం అవుతోంది. సెల్వ సినిమాలు చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. అందుకే కొందరికి ఎక్కడం లేదు. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 4/5 అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

    English summary
    NGK movie twitter review by audience. NGK Suriya and Selvaraghavan's NGK is a political thriller which deals about the dark and gritty underworld of politics, written and directed by Selvaraghavan. Suriya, Rakul Preet Singh, and Sai Pallavi play the lead roles while Devaraj plays a pivotal role. Yuvan Shankar Raja composes the music and Sivakumar Vijayan is the cinematographer. The film is being produced by S. R. Prakashbabu and S. R. Prabhu of Dream Warrior Pictures. Pre-production and principal photography commenced in January 2018. The film is slated to release on 31 May 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X