»   » హైవే మీద హీరోయిన్ అనుష్క హల్ చల్ (ఫోటో)

హైవే మీద హీరోయిన్ అనుష్క హల్ చల్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందాల ఆరబోతకు అభ్యంతరం చెప్పని సెక్సీ గాళ్ అనుష్క శర్మ నిర్మాతగా మారింది. ‘ఎన్‌హెచ్ 10' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథ నచ్చడంతో సహచర నిర్మాతగా వ్యవహరిస్తున్నానని అనుష్క చెబుతోంది. ఎన్‌హెచ్ 10 సినిమాతో తన కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. నేషనల్ హైవే 10 మీదే సినిమా మొత్తం సాగుతుంది. ఇన్నాళ్లు సెక్సీ భామగా అలరించిన అనుష్క ఈ సారి మాత్రం డిఫరెంటు గెటప్ లో అలరించనుంది. యాక్షన్ సన్నివేశాల్లో హైవేపై హల్ చల్ చేస్తూ ఆమె పాత్ర ఉంటుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

NH10 New Poster: Anushka Sharma In Her Best Action Avatar

తాజాగా విడుదలైన పోస్టర్లో చేతిలో ఐరన్ రాడ్ పట్టుకుని వేటాడుతున్నట్టు ఉంది. అనుష్కకు జోడిగా నీల్ నటిస్తున్నాడు. సినిమా కథ విషయానికొస్తే గుర్గావ్‌లో వుండే ఈ జంట, ఢిల్లీ నుంచి హర్యానా మీదుగా పంజాబ్‌‌కి రోడ్ మార్గంలో దాదాపు 403 కిలోమీటర్లు టూర్‌కి ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటిని వారు ఎలా ఎదురుర్కొన్నారు, గమ్యాన్ని ఎలా చేరారు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. మార్చి 6న సినిమా రిలీజ్ కానుంది.

English summary
After receiving an overwhelming response for the first look poster of Anushka Sharma starrer NH10, makers of the film have released the second poster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu