twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌తో రొమాన్స్ పూర్తికాగానే నిధి అగర్వాల్ పని అదే.. ఆ దర్శకుడితో

    |

    మున్నా మైకేల్ అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన నిధి అగర్వాల్ టాలీవుడ్ లో ఇటీవలే అడుగుపెట్టింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో వరుసగా అక్కినేని సోదరులతో రొమాన్స్ చేసిన ఈ భామ ప్రస్తుతం రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చిందులేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ ముద్దుగుమ్మకు మరో అవకాశం తలుపు తట్టింది.

    ఇస్మార్ట్ శంకర్ తర్వాత

    ఇస్మార్ట్ శంకర్ తర్వాత

    ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ పూర్తికాగానే నిధి అగర్వాల్ తమిళంలో ఒక ఛాన్స్ పట్టేసింది. తమిళ్‌లో జయం రవి హీరోగా బోగన్ ఫేమ్ లక్ష్మణ్ రూపొందించనున్న కొత్త సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్‌కి అవకాశం దక్కింది. హోమ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

    నిధి దిమాక్ ఖరాబ్

    నిధి దిమాక్ ఖరాబ్

    ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి తన అందాలను ఆరబోస్తోంది. ఈ సినిమాలో దిమాక్ ఖరాబ్ అనే స్పెషల్ సాంగ్‌లో నిధి అగర్వాల్ గెటప్ కుర్రకారు గుండెల్లో పరుగులు పెట్టించింది. సెట్స్ పై నిధి లుక్ తో ఇటీవలే విడుదలైన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ యాసలో సాగనున్న ఈ సాంగ్‌లో మణిశర్మ బాణీలు, నిధి సోయగాలు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయి.

     నిధి వాలకంపై పూరి జగన్నాధ్ ఫైర్

    నిధి వాలకంపై పూరి జగన్నాధ్ ఫైర్

    పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ అంతా కలిసి విదేశాలకు పయనమవగా.. నిధి తన పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో ఆ టూర్ క్యాన్సిల్ అయిందనే కోపంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెపై ఫైర్ అయ్యారని తెలిసింది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ తుది దశకు చేసురుకుంది.

    నేటితరం భామగా

    నేటితరం భామగా

    ఇటీవలే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ అందానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. నేటితరం భామగా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను నెటిజన్ల ముందుంచుతూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం నిధికి బాగా కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

    English summary
    Young actress Nidhhi Agerwal gets a new chance in tamil cinema industry. After ismart shankar she got chance with jayam ravi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X