వాళ్ళ బండారాలు బయటపడుతున్నాయి.. ఏడుస్తూ కూర్చొను, నేనేంటో చూపిస్తా.. నిధి అగర్వాల్!

Recommended Video

Mr. Majnu Heroine Nidhi Agarwal Exclusive Interview With Filmibeat Telugu

నాగ చైతన్య నటించిన సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది నిధి అగర్వాల్. గ్లామర్, లుక్స్ పరంగా యువతని బాగా ఆకట్టుకుంది. నిధి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తొలి చిత్రంలో నాగచైతన్య సరసన నటించిన నిధి రెండవ చిత్రంలో అఖిల్ తో రొమాన్స్ చేయడం విశేషం. మిస్టర్ మజ్ను చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా నిధి అగర్వాల్ ఫిల్మీ బీట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 ఏడుస్తూ కూర్చొను

ఏడుస్తూ కూర్చొను

సవ్యసాచి చిత్ర విజయం నిరాశపరిచిందా అనే ప్రశ్నకు నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కాస్త నిరాశకు గురయ్యా. కానీ అది ఒకటి రెండు రోజులు మాత్రమే. ఆ తర్వాత నా పనిలో నేను నిమగ్నమైపోయా. ఫెయిల్యూర్ ఎదురైతే ఏడుస్తూ కూర్చునే రకం కాదు నేను. ఎవరైనా నా గురించి తప్పులు ఎత్తి చూపితే తదుపరి చిత్రంలో నేనేంటో నిరూపించాలి అనేంత పట్టుదల పెరుగుతుందని నిధి అగర్వాల్ తెలిపింది.

 నా గురించి కామెంట్స్ విన్నా

నా గురించి కామెంట్స్ విన్నా

నా గురించి వస్తున్న కామెంట్స్ వింటున్నా అని నిధి అగర్వాల్ తెలిపింది. ఏదో అలా నటిస్తుంది.. గ్లామర్ ఉంది అని కామెంట్స్ చేస్తుంటారు. వారందరికీ మిస్టర్ మజ్ను చిత్రంతో సమాధానం ఇచ్చినట్లు అయిందని నిధి అగర్వాల్ తెలిపింది. మిస్టర్ మజ్ను చిత్ర విజయం తర్వాత తానుకు రిలీఫ్ లభించిందని నిధి అగర్వాల్ తెలిపింది. తాను ఓటమిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని నిధి అగర్వాల్ తెలిపింది.

 బండారాలు బయటపడుతున్నాయి

బండారాలు బయటపడుతున్నాయి

నిధి అగర్వాల్ మీటూ ఉద్యమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమం మంచిదే అని నిధి అగర్వాల్ తెలిపింది. దాని వలన మహిళలని వేధించే వారి బండారాలు బయటపడుతున్నాయి. వాళ్లెవరో ప్రపంచానికి తెలుస్తోంది. ఇది మంచి పరిణామమే అని నిధి తెలిపింది. కానీ హీరోయిన్లు కొందరు చెడు రిలేషన్స్ పెట్టుకుని అవి వర్కౌట్ కాకపోతే ఆ వ్యక్తిపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదు. ఈ తరహాలో మీటూ ఉద్యమం సాగితే అది తప్పే అని నిధి తెలిపింది.

నాకు ఎదురుకాలేదు

నాకు ఎదురుకాలేదు

తనకు మాత్రం మీటూ సంఘటనలు ఎదురుకాలేదు అని తెలిపింది. తాను పనిచేసిన అందరు వ్యక్తులు చాలా మంచివారు. మంచి వాతావరణంలో నా చిత్రాల షూటింగ్ జరుగుతుంది అని తెలిపింది. తదుపరి రామ్ సరసన పూరీ జగన్నాథ్ దర్శత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నట్లు నిధి అగర్వాల్ తెలిపింది. మరికొన్ని చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X