యంగ్ క్రికెటర్‌తో డేటింగ్.. టీనేజ్ నుంచే అంటున్న నిధి అగర్వాల్!

Recommended Video

KL Rahul Spotted With Bollywood Actress In Mumbai

సినీతారలు, క్రికెట్ వీరుల మధ్య ప్రేమ వ్యవహారాలు దశాబ్దాల నుంచి జరుగుతున్న తంతే. ఆ జాబితా తీస్తే చాంతాడంత లిస్టు అవుతుంది. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా మరో జంట ఈ లిస్టులోకి చేరింది. యువ క్రికెటర్ కె ఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పిక్స్ ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఐపీఎల్‌తో ఫేమ్‌లోకి

ఐపీఎల్‌తో ఫేమ్‌లోకి

యంగ్ క్రికెటర్ కె ఎల్ రాహుల్ ఐపీఎల్ తో ఫేమ్ లోకి వచ్చాడు. ఇతడి ప్రతిభ గమనిస్తున్న సీనియర్స్ టీం ఇండియాలో కీలక ఆటగాడిగా మారడం ఖాయం అని జోస్యం చెబుతున్నారు.

హాట్ బ్యూటీతో రెస్టారెంట్‌లో

కె ఎల్ రాహుల్, నిధి అగర్వాల్ కలసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిధి అగర్వాల్ ఇప్పుడిప్పుడే సౌత్ లో మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటోంది.

 టీనేజ్ నుంచే అంటున్న నిధి

టీనేజ్ నుంచే అంటున్న నిధి

తాను, కెఎల్ రాహుల్ కలసి డిన్నర్ డాట్ కు వెళ్లిన మాట వాస్తవమే అని నిధి అగర్వాల్ స్పదించింది. కె ఎల్ రాహుల్ తనకు టీనేజ్ నుంచే పరిచయం అని నిధి అగర్వాల్ తెలిపింది. స్నేహితుడు కనుకే డిన్నర్ కు వెళ్ళాం అని చెబుతోంది. కానీ వర్గాలు మాత్రం వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నట్లు చర్చించుకుంటున్నాయి.

క్రేజీ హీరోయిన్‌గా

క్రేజీ హీరోయిన్‌గా

నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయం కాంబోతోంది. ఆ చిత్రం విడుదల కాకముందే ఈ భామకు మంచి క్రేజ్ ఏర్పడింది. నాగచైతన్య సరసన నటిస్తున్న ఈ చిత్రం విజయం సాధిస్తే నిధి అగర్వాల్ టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X