»   » అద్దె ఇంటి నుండి హీరోయిన్ గెంటివేత, ఆమె చేసిన తప్పేంటి?

అద్దె ఇంటి నుండి హీరోయిన్ గెంటివేత, ఆమె చేసిన తప్పేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మూవీ 'ది మున్నా మైఖేల్' హీరోయిన్ నిధి అగర్వాల్‌కు అవమానకర పరిస్థితి ఎదురైంది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి నుండి బలవంతంగా బయటకు పంపారు. ఇంట్లో సింగిల్ గా ఉండటం, హీరోయిన్ గా సినిమాల్లో చేస్తుందనే ఒకే ఒక కారణంతో ఆమెను బయటకు గెంటేసారు.

ఈ విషయంపై నిధి అగర్వాల్ స్పందిస్తూ...' నేను ఒంటరిగా ఉంటున్నాను, నటిని అనే కారణంతో తనను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. ముంబై నగరానికి ఎంతో మంది తమ కలలను నిజం చేసుకోవడానికి వస్తుంటారు. మేము ఏ తప్పూ చేయకున్నా ఇలాంటి కారణాలతో ఇల్లు ఖాళీ చేయించడం చాలా దారుణం' అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను మరో ఇంటి కోసం వెతుకుతున్నాను. చాలా చోట్ల కూడా ఇలాంటి కారణాలతో తాను నటిని, ఒంటరిగా ఉంటున్నానని ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. ప్రస్తుతం నా ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నాను. వీలైనంత త్వరగా నేను మరో ఇంటికి షిప్ట్ అవ్వాలి అని ఆమె తెలిపారు.

నిధి అగర్వాల్

నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ కొంత కాలంగా బాంద్రాలో నివాసం ఉంటోంది. సినిమాల్లో నటిస్తుంది, ఒంటరిగా ఉంటుందనే కారణంతో ఆమెను ఇంటి ఓనర్ బలవంతంగా ఖాళీ చేయించారు.

మహిళ కావడం వల్లే

మహిళ కావడం వల్లే

ఒంటరిగా ఉండే మహిళలంటే అందరికీ చిన్న చూపే..... ఎవరో ఏదో తప్పు చేసారని, అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలా? అని నిధి అగర్వాల్ ప్రశ్నిస్తోంది.

అందరూ అలాగే ఉన్నారు

అందరూ అలాగే ఉన్నారు

తనను ఇల్లు ఖాళీ చేయించిన ఓనర్ మాత్రమే కాదు, చాలా మంది ఇలాంటి కారణాలతోనే ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్ట పడటం లేదు అని నిధి అగర్వాల్ వాపోతోంది.

స్నేహితుల అండ

స్నేహితుల అండ

ప్రస్తుతం తనకంటూ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నిధి అగ్వాల్ అగర్వాల్ కు స్నేహితులు అండగా నిలిచారు. ఆమె మరో ఇల్లు చూసుకునే వరకు తమ ఇంట్లో షెల్టర్ ఇచ్చారు.

ఇలా అయితే ఎలా?

ఇలా అయితే ఎలా?

ముంబై మహానగరానికి ఎంతో మంది తమ పెద్ద పెద్ద కలలను నిజం చేసుకోవడానికి వస్తుంటారు. ఇంటి ఓనర్లు ఇలాంటి షరుతులు పెడితే తనలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తోంది ఈ బాలీవుడ్ చిన్నది.

English summary
The Munna Michael actress Nidhhi Agerwal was forced to move out of her rented house in Mumbai as the owner did not like the fact that she's a single woman and an actress. The disgusting act has enraged a lot of people and Bollywoodlife quoted Nidhhi Agerwal lashing out at the injustice. She said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu