స్వామిజీతో దొరికిపోయిన నిధి అగర్వాల్: వాటి కోసమే ఇలా చేసిందా.. అప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కూడా!
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటారు. తద్వారా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తుంటారు. అలాంటి వారిలో అందాల భామ నిధి అగర్వాల్ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయినా.. ఆ తర్వాత సత్తా చాటింది. అయితే, ఈ మధ్య కాలంలో నిధి పెద్దగా అవకాశాలను అందుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

ఇక్కడి అమ్మాయి.. అలా ఎంట్రీ
హైదరాబాద్‌కు చెందిన మార్వాడి ఫ్యామిలీకి చెందిన నిధి అగర్వాల్.. విద్యాభ్యాసం మొత్తం నగరంలోనే జరిగింది. ఆ తర్వాత వీళ్ల ఫ్యామిలీ కర్నాటకకు వలస వెళ్లింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడల్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. తద్వారా 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ చిత్రంతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా మారింది.

తెలుగులోకి.. మొదట్లోనే షాక్‌లు
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే మంచి పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు అందుకుంది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలో నటించింది. ఇది కూడా ఆమెకు బిగ్ షాక్‌ను ఇచ్చింది.

ఇస్మార్ట్ హిట్.. ఆ వెంటనే దెబ్బ
తెలుగులో హీరోయిన్‌గా హిట్‌ను అందుకోలేకపోయినా.. నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ చిత్రంతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం పాలైంది. దీంతో ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు.

పవన్ సినిమా.. ఇంకోటి లేదుగా
హీరోయిన్‌గా కెరీర్ మొదలైనప్పటి నుంచి హిట్లు ఫ్లాపులతో పని లేకుండా ఆఫర్లను అందుకుంటూ పోతోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో కీలకమైన పాత్రను చేస్తోంది. ఇది మినహా తెలుగులో మరో చిత్రాన్ని ఆమె ప్రకటించలేదు. దీంతో నిధి అగర్వాల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు.

స్వామితో నిధి.. వీడియో వైరల్
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు అస్సలు తీరిక లేకుండా గడిపిన నిధి అగర్వాల్.. ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపడం లేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధి అగర్వాల్.. ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేస్తూ దొరికిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆఫర్ల కోసమా? దోషం గురించా
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్.. జోతిష్యుడు వేణు స్వామితో కలిసి తన ఇంట్లో రాజ శ్యామల పూజ, రాహు కేతు దోష నివారణా పూజలు చేసినట్లు తెలిసింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె ఆఫర్లను పెంచుకోవడం కోసమే ఇలా చేసిందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం దోషలకు నివారణా చేయించడం కోసమే అని చెబుతున్నారు.

అప్పుడు ఆ స్టార్ హీరోయిన్‌తో
జోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పడంతో ఆయన రేంజ్ పెరిగింది. దీంతో సెంటిమెంట్లను నమ్మే సినీ సెలెబ్రిటీలు ఆయన వెంట పడుతున్నారు. ఇలా గతంలో రష్మిక మందన్నా కూడా వేణు స్వామితో పూజలు చేయించింది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్‌గా, నేషనల్ క్రష్‌గా మారింది.


Click it and Unblock the Notifications











