మెగాస్టార్‌తో ఇస్మార్ట్ బ్యూటీ.. ఆమె ఆనందానికి హద్దుల్లేవ్!

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవిని ఎంతో మంది సినీ తారలు ఆధరిస్తుంటారు. అందరితో కలివిడిగా ఉండే ఆయనంటే సినీ పరిశ్రమ అంతా ఇష్టపడుతుంటుంది. ముఖ్యంగా నేటి హీరోహీరోయిన్లు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే షైన్ లోకి వస్తున్న తారలు.. తమకు మెగాస్టార్ ఆశీర్వాదం పొందే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం లేదని ఫీల్ అవుతుంటారు. తాజాగా అలాంటి అవకాశం దక్కించుకుంది నిధి అగర్వాల్.

తాజాగా జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవిని కలిసి తెగ సంబరపడిపోయింది నిధి అగర్వాల్. ఈ మేరకు ఆయనతో దిగిన పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన అవధుల్లేని ఆనందాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇస్మార్ట్ బ్యూటీ నిధిని చూసి ఖుషీ అవుతున్నారు ఇరువురి ఫ్యాన్స్.

దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఎంతో అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా వెళ్లారు.

Nidhhi Agerwal with Chiranjeevi Goes viral on social media

ఇక నిధి విషయానికొస్తే.. కెరీర్ ఆరంభంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో మిశ్రమ స్పందన తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నిధి అందాలు తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేశాయి. ఆమె అందం, అభినయం చూసి రానున్న రోజుల్లో నిధి బిగ్గెస్ట్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X