నాల్గో క్లాస్‌లోనే.. అలా ఎవ్వరూ చేయలేదు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
మంచు లక్ష్మీ హోస్ట్‌గా చేస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే షో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సెలబ్రెటీలతో బెడ్రూమ్ ముచ్చట్లు చెప్పిస్తూ.. ఎన్నో రహస్యాలను ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. తమ లైఫ్‌లోని ఎన్నో సీక్రెట్స్‌ను పంచుకుంటున్నారు.

తాజాగా నిధి..
ఈ క్రమంలో సమంత, శ్రుతీ హాసన్, నిఖిల్, వరుణ్ తేజ్‌లాంటి స్టార్స్ ఈ షోలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. గత వారం నిఖిల్ పాల్గొని తన సినీ విషయాలు, వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతోన్నట్లుగా ప్రటించేశాడు. తాజాగా ఈ షోలో నిధి అగర్వాల్ పాల్గొని ఎన్నో సీక్రెట్స్‌ను బయట పెట్టింది.

ప్రస్తుతం సింగిల్..
ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.. కానీ ప్రస్తుతం తాను సింగిల్ అంటూ నిధి చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ బాయ్ ఫ్రెండ్ లేరని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటివేమీ లేవని.. తన రిలేషన్ షిప్ స్టేటస్ సింగిల్ అని తెలిపింది.

చెల్లికి నో ఎంట్రీ..
తన చెల్లి కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సుముఖుత వ్యక్తం చేస్తోంది.. కానీ తాను వద్దని చెప్పానని తెలిపింది. తను చదువుల్లో బాగా చురుకు అని, బాగా చదువుకోమని సలహా ఇచ్చానని అంది.

నాల్గో క్లాస్‌లోనే..
నాల్గో తరగతి లోనే లవ్ ప్రపోజల్ ఉందని.. ఆ వ్యక్తి ఇప్పటికీ కూడా మంచి ఫ్రెండేనని తెలిపింది. తనకు మొదటి క్రష్ షారుఖ్ ఖాన్ అని తెలిపింది. తనకు బాయ్ ఫ్రెండ్స్ వద్దని.. రాముడి లాంటి మంచి భర్త కావాలని తన మనసులోని కోరిక చెప్పింది.

అలా ఎవరూ చేయలేదు..
ఓ అభిమాని తన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడని.. అలా ఇంతవరకు ఎవరూ చేయలేదని తెలిపింది. షూటింగ్స్ వల్ల సరిగా నిద్ర కూడా ఉండటం లేదని.. నిరంతరం ట్రావెల్ చేస్తూ ఉండటం వల్ల మెడనొప్పి కూడా వస్తోందని పేర్కొంది.


Click it and Unblock the Notifications











