సెట్‌లో హీరో, డైరెక్టర్స్ అంత పని చేశారు.. లాగి పెట్టి కొట్టేశానన్న నిధి అగర్వాల్
సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్.. తన మూడో చిత్రంలో సూపర్ హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే షోలో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది.

ఫీట్ అప్ విత్ ది స్టార్స్...
బుల్లి తెరపై సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ప్రేమతో మీ లక్ష్మీ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేసిన మంచు లక్ష్మీ తాజాగా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అంటూ మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. ఇప్పటికే ఈ షోలో సమంత, రకుల్, శ్రుతీ హాసన్, వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి స్టార్స్ పాల్గొని తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలను పంచుకున్నారు.

ఆధ్యాత్మిక ప్రపంచలోకి..
తాను రీసెంట్‌గా ఆద్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయానని, తనకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమని తెలిపింది. సినిమా రంగంలోకి రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ పోరాడవలసి వచ్చిందని పేర్కొంది. మొదటగా మోడలింగ్ రంగంలో ఉన్నానని.. తరువాత సినిమా రంగంలోకి వచ్చేశానని తెలిపింది.

కేఎల్ రాహుల్‌తో...
క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి కుండబద్దలు కొట్టేసింది. వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు గుప్పుమంటోన్న నేపథ్యంలో ఈ షో ద్వారా వాటన్నింటికి పుల్‌స్టాప్ పెట్టేసింది. అతను చిన్నప్పటి నుంచి తెలుసని, కేవలం స్నేహితులమేనని, కేవలం కాఫీకి మాత్రమే వెళ్లామని దాంతో ఈ వార్తలన్నీ పుట్టుకొచ్చాయని తెలిపింది.

సవ్యసాచి సెట్‌లో..
సవ్యసాచి సెట్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. హీరో, డైరెక్టర్ కలిసి తన షూ లేస్‌ను కట్టేశారు.. దీంతో తాను నడవలేకపోయానని తెలిపింది. కింద పడితే మొహం పగిలిపోతుందని, షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పినట్లు తెలిపింది.

లాగి పెట్టి కొట్టేశాను...
స్కూల్, కాలేజ్ టైమ్‌లో అందర్నీ కొట్టేదాన్నని, ఎవరైనా ప్రపోజ్ చేయడానికి వస్తే లాగే కొట్టేదాన్నని పేర్కొంది. ఒకసారి అలాగే ఐ లవ్యూ అంటూ ఒకడు వచ్చాడని..వాటి లాగి పెట్టి కొట్టాను అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.


Click it and Unblock the Notifications











