ఐటమ్ గర్ల్ గా తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ శృంగార తార నిగర్ ఖాన్ నటించిన హింది సినిమా ఒకటి సరసకు వేళాయరా పేరుతో డబ్బింగ్ అవుతోంది. ముసలి భర్త..పడుచు భార్య స్కీముతో నడిచే ఈ కథ అన్ని వయసుల వారిని ఆకర్షించే ప్రమాదం ఉందని నిర్మాత అంటున్నాడు. అందులోనూ మర్డర్ సినిమా తరహాలో మాంఛి రొమాంటిక్ సన్నివేసాలే గాక రోమాలు నిక్క పొడుచుకొనే సస్పెన్స్ మిస్టరీ అంశాలు కూడా మిళితమై ఉంటాయిట. ఏప్రియల్ లో రిలీజయ్యే ఈ సినిమా మార్కెట్లో మంచి ఆసక్తిని రేపుతోందిట.అంతా బాగానే ఉంది గాని ఇది గాని హిట్టయితే వరసగా 'రామచిలకలు', 'తేనెటీగలు' టైపు సినిమాల డబ్బింగ్ లు స్టార్ట్ అవుతాయి
Story first published: Wednesday, April 22, 2026, 9:48 [IST]