12 మందితో ఓకే: టెర్రరిస్టులకు సింగర్ కన్యత్వం ఆఫర్

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా నైజీరియన్ సింగర్ అడోకియే అలాంటి తెగింపుకే పాల్పడింది. ఒక మంచి పని కోసం తన కన్యత్వాన్ని కోల్పోవడానికి సిద్ధమే అంటూ ప్రకటించేసింది. ఇలాంటి ప్రకటనలు గతంలో చాలా విన్నాం అని అనుకుంటే పొరపాటే. ఆమె ఏకంగా తీవ్రవాదులతో పెట్టుకుంది.

అడోకియే సాధారణ ప్రకటన చేయలేదు. ఏకంగా టెర్రరిస్టులతో సెక్స్‌కు సిద్ధం అంటూ ప్రకటించేసింది. ఆడపిల్లలు చదువుకోవడం మత విరుద్ధం అంటూ అల్ కాయిదా తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న బోకోహరామ్ అనే తీవ్రవాద సంస్థ 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసింది.

Nigerian pop singer Adokiye offers virginity to Boko Haram for missing girls

ఈ ఘటనపై అడోకియే స్పందిస్తూ 'ఉగ్రవాదులారా... ఆ పిల్లల్ని వదిలిపెట్టండి. మీకు కావాలంటే నన్ను తీసుకెళ్లండి. నా కన్యత్వం మీకు సమర్పించుకుంటా' అని ఓ ఆఫర్ ఇచ్చేసింది. అంతే కాదు నన్ను రోజుకు 12 మంది అనుభవించినా నాకు పరవాలేదు అందుకు నేను సిద్ధమే అంటూ ప్రకటన చేసింది.

మరి బోకోహరామ్ తీవ్రవాద సంస్థకు చెందిన వారు సింగర్ అడోకియే ప్రకటనపై ఎలా స్పందిస్తారు? అనేది చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే ఏప్రిల్‌లో జరిగిన ఈ కిడ్నాప్ ఉదంతం ఇంకా వీడలేదు. బందీలైన బాలికల కోసం గాలింపు జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X