twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి ఆఫర్ అయిపోయింది.. అసలు పరీక్ష మొదలు.. థియేటర్ యజమానులు కొత్త ప్లాన్?

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలకు ఊరటనిచ్చే విధంగా నైట్ కర్ఫ్యూ ఆదేశాలు కొద్దిగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు అంటే 18 వ తారీకు రాత్రి నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. దీంతో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలతో పాటు 11 గంటల లోపు సినిమా ఆటలను ముగించాల్సి ఉంటుంది. దీంతో సినిమా థియేటర్ల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాల్లోకి వెళితే

    నైట్ కర్ఫ్యూ అమల్లోకి

    నైట్ కర్ఫ్యూ అమల్లోకి

    ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అంటే 18 వ తారీకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. కొత్త నిబంధనల మేరకు జనవరి 31వ తేదీ వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి.

    ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా

    ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా

    ఆదేశాలను అతిక్రమించిన వారికి రూ.100 జరిమానా విధిస్తారు. ఇక సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించాలి. లేని పక్షంలో యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.

    జరిమానాతో పాటు

    జరిమానాతో పాటు

    ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్ మూసివేసేలా చర్యలు తీసుకోనున్నారు. భారతదేశంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక్కరోజే 4500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ, 50% ఆక్యుపెన్సీని ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం ఇవాళ నుంచి ఆంక్షలు విధించనుంది.

    మంచి కలెక్షన్స్ రాబట్టి

    మంచి కలెక్షన్స్ రాబట్టి

    ఈ క్రమంలో నేటి నుంచి చాలా థియేటర్ల యజమానులు తమ షోలను 11 AM, 2 PM, 5 PM మరియు 8 PMకి షెడ్యూల్ చేసి 11 PMకి షోలను ముగించడానికి సర్వం సిద్ధం చేశాయి. అంటే కేవలం 50% ఆక్యుపెన్సీ నిబంధనల వల్ల థియేటర్ల యజమానులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం థియేటర్లలో చాలా తక్కువ సినిమాలు నడుస్తున్నాయి. అక్కినేని నాగార్జున , నాగ చైతన్య నటించిన బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.

    నిజమైన పరీక్ష ఇప్పుడే

    నిజమైన పరీక్ష ఇప్పుడే

    సంక్రాంతి సెలవులు అందుకు బాగా సహకరించాయి. అయితే దాని నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. బంగార్రాజు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 22 కోట్లు వసూలు చేసింది. అయితే హీరో మరియు రౌడీ బాయ్స్ వంటి సినిమాలు తమ డబ్బును తిరిగి పొందడం చాలా కష్టం. హీరో సినిమాకు ఫర్వాలేదనిపించే కలెక్షన్స్ రాబట్టినా రౌడీ బాయ్స్ కలెక్షన్‌లు అయితే కాస్త ఇబ్బందికరమే. చూడాలి మరి ఎం జరగనుంది అనేది.

    English summary
    Night Curfew in Andhra Pradesh to start today and theaters owners on new plan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X