Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గదిలోకి వచ్చి అలా చేస్తాడు.. అందుకే అరిచేస్తాను.. భర్తపై నిహారిక కామెంట్స్
నిహారిక చైతన్యలు పెళ్లికి ముందు సోషల్ మీడియాలో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక మాత్రం అంతగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. పెళ్లికి ముందే ఏదో ఒక పార్టీ అంటూ సందడి చేసేవారు.బర్త్ డే పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలంటూ ఏదో ఒక వంకతో ఇద్దరూ కలిసేవారు.అయితే ఈ మధ్యే ఓ మీడియాకు ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ కొత్త జంట అనేక విషయాలను పంచుకున్నారు.
క్లాస్ మేట్..
చైతన్య వరుణ్ తేజ్ క్లాస్ మేట్స్ అంటా. తొమ్మిదో తరగతిలో కలిసి చదువుకున్నారట. చిరంజీవితో తన ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయని చైతన్య చెప్పుకొచ్చాడు. మా నాన్న, చిరంజీవి అంకుల్ ఫ్రెండ్స్. అలా ఈ సంబంధం కలిసిందంటూ అసలు సంగతి బయటపెట్టేశాడు. అయితే నిహారికను మాత్రం పెళ్లి టాపిక్ వచ్చాకే కలిశానని అంతకు ముందెప్పుడూ కూడా కలవలేదని అన్నాడు.
పెళ్లి తరువాత లైఫ్..
పెళ్లి తరువాత లైఫ్ గురించి నిహారిక బయటకు చెప్పేసింది. తాను ఇంట్లో ఎంత కంఫర్ట్‌గా ఉన్నానో అత్తింట్లోనూ అలానే ఉన్నానని పైగా అంతకు మించి గారాభం చేస్తారని తెలిపింది. పుట్టింట్లో కాస్త ఆలస్యంగా లేస్తే తిట్టేవారు కానీ అత్తింట్లో మాత్రం నేను పడుకున్నానంటే అసలు డిస్టర్బ్ చేయరని, ఆకలి అంటే ముద్దలు కలిపి నోట్లో పెట్టేస్తుంది మా అత్త అంటూ మురిసిపోయింది నిహారిక.
కోపం మాత్రం తనకే..
అయితే భార్యభర్తల్లో ఎవరికి కోపం ఎక్కువగా వస్తుందనేప్రశ్నకు మాత్రం చైతన్య నిహారిక పేరు చెప్పేశాడు. నిహారిక కూడా నిజాయితీగా తన పేరు చెప్పుకుంది. తనకి కాస్త కోపం ఎక్కువ అని అరిచేస్తాను అని అసలు విషయం చెప్పింది.
గదిలోకి వచ్చి..
గదిలో ఉన్నప్పుడు లోపలికి వచ్చి డోర్ వేయకుండా అలా వెళ్లిపోతుంటారు.. మనమేమో కంఫర్ట్‌గా బెడ్ మీద కూర్చొని ఉంటాం.. మళ్లీ లేచి వెళ్లాలంటే చిరాగ్గా ఉంటుంది.. చైతన్య కూడా అలానే చేస్తాడు.. అలాంటి సమయంలోనే కోపం వస్తుందని చెప్పుకొచ్చింది.
అరిచేస్తాను..
ఏంటి చై ఇలా చేస్తావ్ అంటూ అరిచేస్తాను అంటూ అసలు విషయం బయటపెట్టేసింది. అలాంటి చిన్న చిన్న విషయాలకే అరుస్తాను.. కానీ వెంటనే కూల్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. సారీలు మాత్రం మొదటగా చైతన్యే చెబుతాడట. అలా చెప్పేలా నిహారిక చేస్తుందట. మొత్తానికి పెళ్లి తరువాత నిహారిక మహారాణి యోగం అనుభవిస్తోన్నట్టు కనిపిస్తోంది.