పవన్ కళ్యాణ్‌పై నిహారిక కామెంట్స్.. అసలు పేరు తెలుసా మీకు, రచ్చ చేసిన ఫ్యాన్స్!

Recommended Video

Niharika Comments On Pawan Kalyan Made Fans Crazy || Filmibeat Telugu

మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నిహారిక కేవలం తనకు సరిపడే పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులువేస్తోంది. తాజాగా నిహారిక నటిస్తున్న చిత్రం సూర్యకాంతం. రాహుల్ విజయ్ నిహారికకు జంటగా నటిస్తున్నాడు. దర్శకుడు ప్రణీత్ హాస్యానికి పెద్ద పీట వేస్తూ నిహారిక పాత్రని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యకాంతం చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

సూర్యకాంతం చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిహారిక అల్లరి అమ్మాయిగా హాస్యాన్ని పండిస్తోంది. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండడంతో తెలుగురాష్ట్రల్లోని పలు పట్టణాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించి నిహారిక సరదాగా స్పందిస్తూ జనసేన పార్టీ గురించి ప్రస్తావించింది.

అసలు పేరు తెలుసా

అసలు పేరు తెలుసా

నిహారిక ప్రసంగిస్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ గోల మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్.. ఈ విషయం మీ అందరికీ తెలుసా అని నిహారిక అభిమానులని అడిగింది. ఆయన మా నాన్నకు తమ్ముడు.. చిరంజీవి గారికి తమ్ముడు.. నాకు బాబాయ్ అంటూ క్యూట్ గా మాట్లాడింది. ఆయన జనసేన పార్టీ పెట్టారు అని అనడంతో అభిమానులు కేరింతలు మరింతగా ఎక్కువయ్యాయి.

నా బదులు మీరంతా

నా బదులు మీరంతా

జనసేన పార్టీకి ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. నాకు ఆంధ్రాలో ఓటు లేదు కాబట్టి మీరందరూ జనసేనకు ఓటు వేయండి అని నిహారిక అక్కడున్న ఫ్యాన్స్ ని కోరింది. టీ గ్లాసుతో ఒక ఫోటో ఉంది.. దానిని ఎలక్షన్ టైంలో పోస్ట్ చేస్తానని నిహారిక తెలిపింది. తాను నటించిన సూర్యకాంతం చిత్రాన్ని అందరూ చూడాలని కోరింది.

కామెడీ జోనర్

కామెడీ జోనర్

ఇక నిహారిక సినిమాల విషయానికి వస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతవరకు నిహారికకు సరైన హిట్ దక్కలేదు. ఓ తమిళ చిత్రంలో కూడా నటించింది. ఇదిలా ఉండగా నిహారిక మెగాస్టార్ సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది. సూర్యకాంతం చిత్ర రిజల్ట్ నిహారిక కెరీర్ కు కీలకం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X