రొమాంటిక్ మూడ్‌లో కొత్త జంట.. నిహారిక చైతన్య పిక్ వైరల్
మెగా ఇంట్లో పండుగ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలకు మెగా అల్లు ఫ్యామిలీలు ఒకే చోటకు చేరుతుంటాయి. పండుగ వాతావరణం మొత్తం అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. మెగా కజిన్స్ అందరికీ గెట్ టుగెదర్‌లా ఈ క్రిస్మస్ వేడుకలను రామ్ చరణ్ ఉపాసనలు దగ్గరుండి మరి ఏర్పాట్లు చేశారట. ఇక మెగా కజిన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి.
Recommended Video

తాజాగా అలా..
ఇటీవలే నిహారిక పెళ్లిలో మెగా కజిన్స్ ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. మెగా అల్లు ఫ్యామిలీ ఒకే చోట కనిపిస్తే అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది.నిహారిక పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మెగా హీరోలందరూ కలిసి స్టెప్పులు వేయడం, కలిసి పోజులివ్వడంతో ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోయారు.

రామ్ చరణ్, ఉపాసనలు..
క్రిస్మస్ పండుగు, హాలోవెన్ లాంటి పండుగలను కూడా మెగా ఫ్యామిలీ సెలెబ్రేట్ చేస్తుంటుంది. ఈ ఏడాది రామ్ చరణ్ ఉపాసలను ఈ పార్టీని హోస్ట్ చేశారట. అందరినీ ఒక్క చోటకు చేర్చి.. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకున్నారట. ఈ మేరకు మెగా క్రిస్మస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా కజిన్స్ అంతా ఒక్క చోటే..
క్రిస్మస్ వేడుకల్లో దాదాపు అందరూ జంటలుగానే కనిపించారు. అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు మాత్రమే సింగిల్‌గా ఉన్నారు. శ్రీజ, సుష్మిత, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు బాబీ ఇలా అందరూ కూడా జంటలుగానే దర్శనమిచ్చారు. మొత్తానికి మెగా జంటలు రచ్చ రచ్చ చేశాయి. ఇందులో కొత్త జంట నిహారిక చైతన్య మాత్రం ప్రత్యేకం ఆకట్టుకున్నారు.

రొమాంటిక్ మూడ్..
నిహారిక రెడ్ డ్రెస్ ధరించింది. పెళ్లి తరువాత పొట్టి బట్టల్లో రచ్చ చేస్తున్న నిహారిక ఈ వేడుకల్లోనూ షాకిచ్చింది. భర్త కౌగిలో బంధీ అయిన నిహారిక మైమరిచిపోయినట్టుంది. ఈ ఇద్దరూ ప్రేమలోకం విహరిస్తూ ఉండగా ఇలా కెమెరాలో బందించారు. మొత్తానికి క్రిస్మస్ వేడుకల్లో రొమాంటిక్ జంటగా బాగానే క్లిక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











