సంగీత్ ఈవెంట్‌లో సందడి.. మెగా పాటలకు నిహారిక చైతన్య స్టెప్పులు.. వీడియో వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మెగా అల్లు హీరోల ఫోటోలే దర్శనమిస్తున్నాయి. మొత్తానికి మెగా ఈవెంట్ కన్నులపండువగా జరుగుతోంది. నిహారిక పెళ్లికి వారోత్సవాలు జరిగినట్టుగా గత వారం నుంచే సంబరాలు మొదలయ్యాయి. ఇక ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేడుకల్లో జోరందుకుంది. నిన్న మెగా అల్లు ఫ్యామిలీలు స్పెషల్ ఫ్లైట్‌లోకి ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు వెళ్లారు.

ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

నిహారిక పెళ్లికి ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను బుక్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న రాత్రి జరిగే ఈ ఈవెంట్‌కు మెగా అల్లు ఫ్యామిలీలు నిన్ననే ఉదయ్ పూర్‌కు బయల్దేరారు. ప్రత్యకంగా ఫ్లైట్‌లో వెళ్లడం, ఎయిర్ పోర్టులో ఫ్యామిలీతో బన్నీ, చెర్రీ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఉదయ్ విలాస్ సౌందర్యం..

ఉదయ్ విలాస్ సౌందర్యం..

నిహారిక పెళ్లి కోసం ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను మరింత అందంగా ముస్తాబు చేశారు. ప్యాలెస్ అందాలు అక్కడ మెగా అల్లు ఫ్యామిలీలు చేసే అల్లరి సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. నిహారిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్లినట్టు కనిపిస్తోంది.

నాగబాబు మిత్రులు..

నాగబాబు మిత్రులు..

నాగబాబు మరీ ముఖ్యంగా తన మిత్రులందరినీ ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. నాగబాబు తన బుల్లితెర సహనటులు, సీరియల్ యాక్టర్స్‌ను స్పెషల్‌గా తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. నాగబాబు ఎక్కువగా వారితోనే కలిసి సందడి చేస్తున్నట్టు బయటకు వచ్చిన ఫోటోలు చెబుతన్నాయి.

సంగీత్ ఈవెంట్..

నిన్న రాత్రి సంగీత్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మెగా, అల్లు మనరాళ్లు రచ్చ రచ్చ చేశారు. అందులో మరీ ముఖ్యంగా సుష్మిత, శ్రీజ కూతుళ్లు సందడి చేశారు. ఏక్ బార్ ఏక్ బార్ అంటూ రామ్ చరణ్ పాటకు స్టెప్పులు వేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్అవుతున్నాయి.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
చిరు పాటకు..

చిరు పాటకు..

బావగారు బాగున్నారాలోని ఆంటీ కూతురా అమ్మో అప్సరా అనే పాటకు నిహారిక చైతన్యలు అదిరిపోయేలా డ్యాన్సులు వేశారు. చిరంజీవి, రంభ వేసిన సిగ్నేచర్ స్టెప్పులను నిహారిక చైతన్యలు వేయడంతో అంతా గోలగోల చేశారు. మొత్తానికి సంగీత్ ఈవెంట్‌లో హీరోలందరూ కలిసి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ నిహారిక చైతన్యలు వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X