అపుడు అందరినీ జైల్లో పెడతారు: పెళ్లి వార్తలపై నిహారిక

By Bojja Kumar

మెగా డాటర్ నిహారిక త్వరలో 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలో తనకు జంటగా నటించిన సుమంత్ అశ్విన్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ప్రచారంలోకి వస్తున్న పుకార్లపై నిహారిక స్పందించారు. ఈ విషయంలో తాను ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ మళ్లీ అలాంటి వార్తలే రాస్తున్నారని, అందుకే వాటిని పట్టించుకోవడం మానేశానని తెలిపారు.

నిజంగా పెళ్లి ఫిక్స్ అయితే ఎవరూ పట్టించుకోరేమో?

నిజంగా పెళ్లి ఫిక్స్ అయితే ఎవరూ పట్టించుకోరేమో?

ఇపుడు నా పెళ్లి గురించి గాసిప్స్ రూపంలో స్పైసీగా, హాట్‌గా హెడ్ లైన్స్ వేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలు నాకు నిజంగా పెళ్లి కుదిరితే నమ్మరేమో? అపుడు సెన్సేషన్ చేయడానికి విషయం ఏమీ ఉండదేమో? అని నిహారిక వ్యాఖ్యానించారు.

 జెన్యూన్‌గా నా ఎమోషన్ చెబితే కూడా...

జెన్యూన్‌గా నా ఎమోషన్ చెబితే కూడా...

‘హ్యాపీ వెడ్డింగ్' మూవీ ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఓ వీడియో చేశా. అందులో నా మనసులో ఉన్నదంతా బయటకు కక్కేసి యాక్టింగ్ చేయకుండా జెన్యూన్‌గా నా ఎమోషన్ చెబితే దాని మీద కూడా రకరకాల వార్తలు వేశారు... అని నిహారిక తెలిపారు.

అపుడు అందరినీ జైల్లో పెడతారు

అపుడు అందరినీ జైల్లో పెడతారు

నేను ఊహించినట్లే... ‘పెళ్లి మీద నిహారిక రియాక్షన్ చూస్తే షాకే' అని హెడ్ లైన్స్ వేశారు. ఆ వార్తను ఎప్పుడో ఒకప్పుడు ఎవడో చూసి నిజంగానే షాకయ్యి ఆసుపత్రిలో జాయినై చచ్చిపోతాడు.. అపుడు అందరినీ జైల్లో వేస్తారు(నవ్వుతూ)... అంటూ నిహారిక చమత్కరించారు.

హ్యాపీ వెడ్డింగ్ రిలీజ్

హ్యాపీ వెడ్డింగ్ రిలీజ్

‘హ్యాపీ వెడ్డింగ్' ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.

నటీనటుల: సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి

సాంకేతిక నిపుణులు..
యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్
కెమెరా - బాల్ రెడ్డి
మ్యూజిక్ - శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ - పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మ‌ణ్ కార్య‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X