twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యపీ వెడ్డింగ్‌కు ముగింపు పలికిన మెగా డాటర్ నిహారిక

    By Bojja Kumar
    |

    మెగా డాటర్ నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్'కు ముగింపు పలికింది. హ్యాపీ వెడ్డింగ్ అంటే ఇంకేదో అనుకోవద్దు. ఇది ఆమె నటిస్తున్న రెండో తెలుగు సినిమా. 'ఒక మనసు' చిత్రం ద్వారా నిహారిక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో గ్యాప్ తీసుకున్న నిహారిక ఆ తర్వాత ఓ తమిళ సినిమాచేస్తూనే.... మరో వైపు తెలుగులో 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరో.

    Recommended Video

    Niharika's Next Web Series Ready నీహారిక నెక్స్ట్ వెబ్ సిరీస్ రెడీ..
    హ్యాపీ వెడ్డింగ్

    హ్యాపీ వెడ్డింగ్

    రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా హ్యాపీ వెడ్డింగ్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం షూటింగ్ ముగియడంతో నిహారిక తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

    కాన్సెప్టు ఏమిటి?

    కాన్సెప్టు ఏమిటి?

    ప్రేమ, పెళ్లి అనే పాయింటును బేస్ చేసుకుని మంచి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. అబ్బాయి, అమ్మాయి పట్నంలో చదువు, ఉద్యోగం... పెళ్లి మాత్రం తమ కుటుంబం సొంత ఊరైన పల్లెటూరిలో... ఈ బ్యాక్ డ్రాపుతో చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది.

    కొత్త దర్శకుడే

    కొత్త దర్శకుడే

    ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీగా, కుటుంబ బంధాలతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మిక్స్ చేసి ఈచిత్రాన్ని రూపొందించారు.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్

    ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. దేవిశ్రీ మ్యూజిక్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మెగా డాటర్ మూవీ. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజిక్ పై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి.

    యూవీ క్రియేషన్స్

    యూవీ క్రియేషన్స్

    మరో వైపు ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘యూవి క్రియేషన్స్' వారు నిర్మించడం కూడా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. ఈ బేనర్ వారు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సాహో' చిత్రం చేస్తున్నారు.

    నిహారిక తమిళ సినిమా

    నిహారిక తమిళ సినిమా

    దీంతో పాటు నిహారిక తమిళంలో అరుముగ కుమార్ దర్శకత్వంలో ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్' చిత్రం చేస్తోంది. ఈ చిత్రంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, నిహారిక‌ రెండు వైవిధ్యమైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌.

    హ్యాపీ వెడ్డింగ్ టీమ్

    హ్యాపీ వెడ్డింగ్ టీమ్

    .

    English summary
    "From the First day to the last! It was a great great team to work with! Thank you everyone! My next film in Telugu- HAPPY WEDDING." Niharika said about her second film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X