నిహారిక భర్త చైతన్య షాకింగ్ పోస్ట్.. ఎవరూ ఊహించని ప్రదేశంలో గడిపానంటూ!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన పేరును తెచ్చుకుంది నిహారిక కొణిదెల. యాక్టింగ్ పరంగా ఏమాత్రం సక్సెస్ కాలేకపోయిన ఈ అమ్మాయి.. పర్సనల్ లైఫ్‌ను కూడా సానుకూలంగా నడుపుకోవట్లేదని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆమె కొంత కాలంగా భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటోందని టాక్ రావడమే. అందరూ అనుకున్నట్లుగానే వీళ్లిద్దరూ నిజంగానే విడివిడిగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మెగా అల్లుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఊహించని పోస్ట్ చేశాడు.

డెస్టినేషన్ వెడ్డింగ్ : నిహారిక కొణిదెలకు మూడేళ్ల క్రితమే చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. వీళ్ల పెళ్లి ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో జరిగింది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. దాదాపు మూడు రోజుల పాటు సందడిగా జరిగిన ఈ పెళ్లి తెగ హైలైట్ అయింది.

niharikachaitanya4
డివోర్స్ కలకలం : చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అంతేకాదు, అతడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరిగింది. దీంతో వీళ్ల లైఫ్ సాఫీగా సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనే నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ టాక్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సెన్సేషన్ అయింది.

chithanya
అన్‌ఫాలో, డిలీట్ : నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వైరల్ అవడానికి కారణం వీళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే అని తెలిసిందే. అతేకాదు, విడాకుల వార్తలకు బలం చేకూర్చేలా నిహారికకు సంబంధించిన పిక్స్‌తో పాటు పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో ఇది నిజమే అని అనుకుంటూ వచ్చారు.

niharikachaitanya3
ఎంగేజ్‌మెంట్‌లో : మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వబోతుందని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్లుగానే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అలాగే, ఈ మధ్య జరిగిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లోనూ నిహారిక భర్త కనిపించలేదు. దీంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం కన్ఫార్మ్ అని టాక్ వినిపిస్తోంది.

niharikachaitanya3
చైతన్య పోస్టుతో : సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే చైతన్య జొన్నలగడ్డ.. తన భార్య నిహారికతో విడాకులు తీసుకోబోతున్నాడు అని టాక్ వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయాడు. అలా దాదాపు నాలుగు నెలల నుంచి అతడి జాడ తెలియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చైతన్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తొలి పోస్ట్ చేశాడు. అది కూడా మహారాష్ట్రలోని ఓ యోగా సెంటర్ గురించి.

niharikachaitanya3
సంతోషంగా ఉంది : తాజాగా చైతన్య ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటోలు షేర్ చేశాడు. అంతేకాదు, 'ఇక్కడికి వచ్చేలా నన్ను ప్రేరేపించిన వాళ్లకు నా కృతజ్ఞతలు. ఒక చోటుకు మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. అలా నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు నుంచి యోగను చేయడం వల్ల నా లైఫ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది' అని చెప్పాడు


విడిపోవడం వల్లే : తాజాగా చైతన్య చేసిన పోస్టుపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిహారికతో అతడికి బ్రేకప్ అవడం వల్లే ఈ యోగా సెంటర్‌కు వచ్చి ఉంటాడని కొందరు చెప్తున్నారు. మరికొందరు మాత్రం అతడు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని అంటున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత పోస్ట్ చేసిన చైతన్య.. విడాకులపై స్పందిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X