నిహారిక ఫోన్‌లోని సీక్రెట్స్ ఇవే.. అందులో ఉన్న యాప్స్.. కాబోయే భర్త ఫోటోను అలా..!!
మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై అప్పట్లో రోజుకో వార్త తెరపైకి వచ్చేది. నిహారిక పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా? అనే వార్తలు వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌లో తెగ వైరల్ అయ్యేవి. చివరకు ప్రభాస్‌తో కూడా నిహారిక పెళ్లి అని వార్తలు రాసేశారు. అయితే ఎట్టకేలకు ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పడింది. నిహారికయే స్వయంగా తనకు కాబోయే భర్తను, అతని ఫోటోను షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రొమాంటిక్ ఫోటోలు..
మొదటగా నిహారిక షేర్ చేసిన ఫోటోల్లో ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అంతేకాకుండా మొహాన్ని కూడా క్లియర్‌గా చూపించలేదు. గాఢంగా హత్తుకున్న ఫోటోలను మాత్రమే రివీల్ చేయగా.. అందులో నిహారిక మాత్రమే కనిపించింది. అయితే కొంతసేపటి అసలు ఫోటోలు, వివరాలన్నీ బయటకు వచ్చాయి.

పోలీస్ బాస్ కొడుకు..
గుంటూరు ఐజీ కొడుకు చైతన్య నిహారికను చేసుకోబోతోన్నాడని వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. నిహారిక, చైతన్యల ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి చైతన్యకు కూడా సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ పెరిగింది. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం, వచ్చ ఏడాది పెళ్లి ఉండోబోతోందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో చిట్ చాట్..
తాజాగా నిహారిక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. కేవలం కొందరికి మాత్రమే రిప్లై ఇవ్వకండి.. అందరికీ ఇవ్వండని ఓ నెటిజన్ అనగా.. ఓకే అంటూ మెగా డాటర్ రిప్లై ఇచ్చింది.
Recommended Video

ఫోన్‌లో సీక్రెట్స్..
మరో నెటిజన్ మీ మొహం మీద మొటిమ ఉందని చెప్పగా.. కనిపెట్టినందుకు నీ అవార్డు ఇస్తాలే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారని అడగ్గా.. తమిళంలో ఓ చిత్రం చేస్తున్నానని పేర్కొంది. మీ ఫోన్‌లో వాల్ పేపర్ ఏంటని ప్రశ్నించగా.. భర్తతో రొమాంటిక్‌గా దిగిన ఫోటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని చూపించింది. దాంతో పాటు ఆమె ఫోన్‌లో ఉన్న కొన్నియాప్స్ కూడా అందరికీ తెలిసిపోయాయి. ఎక్కువగా ఫోన్‌లో ఆటలు ఆడుతున్నట్టు తెలుస్తోంది. క్యారమ్స్ , హిడ్డెన్ పజిల్స్ అనే గేమ్ యాప్‌లు కంటబడ్డాయి.


Click it and Unblock the Notifications











