Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ముగ్గురి వల్లే ఎవరూ నాకు లవ్ ప్రపోజ్ చేయడం లేదు: మెగా ప్రిన్స్ నిహారిక
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా తెరంగ్రేటం చేసిన తొలి హీరోయిన్ నిహారిక. అభిమానులంతా ఆమెను మెగా ప్రిన్సెస్ అనిపిలుస్తుంటారు. కానీ నిహారికకు అలా పిలిపించుకోవడం ఇబ్బందిగా ఉంటుందట. ఇటీవల ఓ టాక్ షోలో నిహారిక మాట్లాడుతూ....'మెగా ప్రిన్సెస్' అని పిలిపించుకోవాలని నాకు అస్సలు ఉండదు. అలా ఎవరైనా పిలిస్తే అక్కడి నుండి లేచి వెళ్లిపోవాలనిపిస్తుంది అని వెల్లడించారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు నిహారిక పంచుకున్నారు. ముఖ్యంగా కాలేజీ సమయంలో లవ్ ప్రపోజల్స్ గురించి నిహారిక చెప్పిన సమాధానం మరింత ఆసక్తిగా ఉంది.
ఆ ముగ్గురి వల్లే నాకు ప్రపోజల్స్ రావడం లేదేమో?
ప్రమాణ పూర్తిగా నాకు ఇప్పటి వరకు ఎలాంటి లవ్ ప్రపోజల్స్ రాలేదు. చాలా మంది నాకు లక్షల్లో, కోట్లలో ప్రపోజల్స్ వస్తాయని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ జరులేదు. నన్ను చూడగానే జనాలకు నా వెనక మూడు ఫిగర్లు కనిపిస్తాయేమో? మా నాన్న, మా అన్నయ్య, డాడీ(చిరంజీవి).... వీరిని చూసి భయపడుతున్నారేమో? అని నిహారిక వ్యాఖ్యానించారు.
నేనూ ఆడపిల్లనే, అలాంటి కోరిక నాకూ ఉంటుంది
అందరు ఆడపిల్లల మాదిరిగానే... ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే బావుంటుందని నాకూ అనిపిస్తూ ఉంటుంది. రోజా పువ్వు కూడా ఇవ్వనవసరం లేదు, లవ్ లెటర్ నాకు చేతికి ఇచ్చే ధైర్యం లేకపోతే నేను కూర్చున్న టేబుల్ ముందు పెట్టినా తీసుకుని నాకు వచ్చిన తొలి లవ్ ప్రపోజల్ అని దాచి పెట్టుకుంటాను. కానీ ఎవరూ నా విషయంలో ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదు... అని నిహారిక అన్నారు.
ఎవడైనా ఇవ్వకపోతాడా? అని ఎదు చూశా
కాలేజ్ టైమ్‌లో ఎవడైనా నాకు ప్రపోజ్ చేయకపోతాడా? లవ్ లెటర్ ఇవ్వకపోతాడా? అని ఎదురు చూశాను...కానీ అలాంటిదేమీ జరుగలేదు. వారి పేరు రాయడానికి భయంగా ఉంటే ఆకాశ రామన్న అని పేరు పెట్టి రాసినా చాలు.... ఐయామ్ హ్యాపీ అంటూ నిహారిక వ్యాఖ్యానించారు.
ఒక్కోసారి నేను బావుండనా? అనే డౌట్ వస్తుంది
నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి నేను బావుండనా? అందుకే ఎవరూ లవ్ ప్రపోజ్ చూయడం లేదా? అనే డౌట్ కూడా వస్తుంది. అదే సమయంలో .... బహుషా నా వెనక ఉన్న ఫిగర్స్ చూసి భయం వల్ల ఇలా జరుగుతుందేమో? అనే సందేహం వస్తుంటుంది అని నిహారిక తెలిపారు.
మా నాన్న చాలా బ్రాడ్ మైండెడ్
ప్రపోజల్స్ రాకుంటే మీ నాన్నగారు నీకు పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తారేమో? అని టాక్ షో హోస్ట్ అడగ్గా... దీనికి నిహారిక సమాధానం ఇస్తూ మీకు మా నాన్న గురించి తెలియదు. ఆయన చాలా బ్రాడ్ మైండెడ్, ఆయన జనరేషన్ వారిలా కాకుండా చాలా అడ్వాన్డ్స్ గా ఆలోచిస్తారు. అయినా ఈ రోజుల్లో పెళ్లి చూపుల వ్యవహారం అంతా మారింది, ఒకప్పటిలా లేదు అని నిహారిక తెలిపారు.
నాకు పెళ్లి చూపులు ఐడియా అంటే చాలా ఇష్టం, కానీ అలా కాదు
నాకు పెళ్లి చూపులు ఐడియా అంటే చాలా ఇష్టం. మా అమ్మను చాలా సార్లు అడిగాను. వాళ్ల పెళ్లి చూపుల స్టోరీ చాలా క్యూట్‌గా ఉంటుంది. అయినా ఇప్పటి పెళ్లి చూపుల్లో కాఫీలు ఇవ్వడం, పాటలు పాడటం లాంటివి లేవనే అనుకుంటున్నాను. ఒక వేళ నాకు పెళ్లి చూపులు జరిగినపుడు ఒకసారి అలా నడవమ్మా అని ఎవరైనా అడిగితే ‘గంగ' చిత్రంలో నిత్యా మీనన్ లాగా కుంటుకుంటూ నడుస్తాను. ఇలాంటి పెళ్లి చూపులు నచ్చదు. ఇప్పటి జనరేషన్ కు తగిన విధంగా ఉండాలి. పెళ్లి అయిన తర్వాత పెళ్లి చూపులు గురించి గుర్తు చేసుకుంటే అదో మధురజ్ఞాపకంలా ఉండాలి అని నిహారిక తెలిపారకు.