దాని కోసం చచ్చినా పర్లేదు.. నిహారిక కామెంట్స్
మెగాడాటర్ నిహారిక చిరునవ్వుకే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మెగాడాటర్ ఒకరి చిరునవ్వుకు పడిపోతుందంటా. ఆ చిరునవ్వు కోసం చచ్చినా పర్లేదంటూ పోస్ట్ చేసింది. మెగా డాటర్‌గా వెండితెరపై మెరిసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్న నిహారిక.. ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోతోంది. బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన నిహారిక.. సినిమాల్లో ఆ మేరకు రాణించలేకపోతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిహారికకు భారీ ఫాలోయింగే ఉంది.
సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. నిహారికి శ్రీజ-కళ్యాణ్ దేవ్‌ల కూతురు నవిష్క అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. నవిష్కకు పట్టుకుని ముద్దు చేసే ఫోటోలను లెక్కలేనన్నంటిని షేర్ చేసింది.

తాజాగా అలాంటి ఫోటో ఒకటి షేర్ చేస్తూ.. ఈ నవ్వుకోసం చచ్చినా పర్లేదు.. నా బంగారు నవిష్క అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కళ్యాణ్ దేవ్ రిప్లై ఇస్తూ.. అవును కరెక్టే అని చెప్పుకొచ్చాడు. నిహారిక తాజాగా తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రాజెక్ట్‌పై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అవును నిజమే.. నేను ఎంతో ఆత్రుతగా ఉన్నాను.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుందా? అని ఆగలేకపోతోన్నా.. నా నెక్ట్స్ ఫిల్మ్ అశోక్ సెల్వన్ ( ఓ మై కడవలే ఫేమ్)తో, స్వాతిని దర్శకురాలిగా పరిచయం అవుతోందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











