twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నడిరోడ్డుపై నిలబడి..: మెగా హీరోయిన్ నిహారిక ఏం చేసిందో తెలుసా?(వీడియో)

    |

    Recommended Video

    మెగా హీరోయిన్ నిహారిక నడిరోడ్డుపై ఏం చేసిందో తెలుసా?

    సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలకు మరింత పబ్లిసిటీ దొరుకుతోంది. కేవలం సినిమాలే గాక.. అభిమానులను ఆకట్టుకోవడానికి తమదైన ట్వీట్స్ లేదా వీడియోలతో సోషల్ మీడియాలో టచ్ లోకి వస్తున్నారు. మెగా హీరోయిన్ నిహారిక కూడా సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది..

    నిహారిక వీడియో..

    చేతుల్లో బంధించిన సీతాకోకచిలుకను నడిరోడ్డుపై నిలబడి గాల్లోకి ఎగిరేస్తున్న ఓ వీడియోను నిహారిక తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ సీతాకోక చిలుక.. చేతుల్లో నుంచి అలా ఎగరగానే దాన్ని చూసి సంబరపడిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     ఆటవిడుపు..:

    ఆటవిడుపు..:

    ప్రస్తుతం నిహారిక తమిళంలో 'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌' అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ గ్యాప్‌లో ఆటవిడుపు కోసం ఇలా సీతాకోకచిలుక వెంటపడ్డట్లుంది. వీడియోలో నిహారిక ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

    వన్&ఓన్లీ మెగా హీరోయిన్:

    వన్&ఓన్లీ మెగా హీరోయిన్:

    'మెగా కాంపౌండ్' నుంచి హీరోల జాబితా పెద్దదిగానే ఉంది కానీ.. హీరోయిన్ మాత్రం వన్&ఓన్లీ 'నిహారిక'. మెగా కుటుంబం గారాల పట్టిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారికకు తెలుగులో చేసిన తొలి సినిమా 'ఒక మనసు' నిరాశే మిగిల్చింది. ఇప్పుడు తమిళ సినిమాతో కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమైపోయింది.

     ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌..:

    ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌..:

    కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సేతుపతి- గౌతమ్ కార్తీక్ హీరోలుగా 'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌' స్ట్రయిట్ తమిళ సినిమా తెరకెక్కుతోంది. నిహారిక కోలీవుడ్‌లో పరిచయం కాబోతుంది. ఈ టైటిల్‌కు 'ఒక మంచి రోజు చూసి చెబుతా' అని అర్థం. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల కాకపోతుండటం మెగా అభిమానులను నిరాశపరుస్తోంది.

    విభిన్న పాత్రలో..

    విభిన్న పాత్రలో..

    'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌'లో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని నిహారిక చెబుతోంది. దర్శకుడు ఆర్ముగకుమార్‌ సినిమాను అద్భతుంగా మలిచారని అంటోంది. కాగా, ఈ సినిమాను 7సీస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, అమ్మీ నారాయణ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Mega Heroine Niharika Konidela posted a butterfly video in twitter. Present she is acting in a tamil movie, which is almost ready to release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X