Niharika Konidela: ఆ వ్యక్తితో నిహారికకు ఎఫైర్... ఆ ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిందిగా!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికి తెలిసిందే. నాగబాబు కుమార్తె, వరుణ్ తేజ్ చెల్లెలిగానే కాదు... తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ భామ ఈ ఏడాది తన భర్తతో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక విడాకులకు తోడు.. ఒక వ్యక్తితో నిహారికకు ఎఫైర్ ఉందంటూ రోజు రోజూకూ వార్తలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నిహారిక ఆ వార్తలకు ఒకే ఒక్క పోస్టుతో చెక్ పెట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
నిహారిక కొణిదెల... మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా కెరియర్ ప్రారంభించి చిన్న చిన్న వెబ్ సిరీస్ లు చేస్తూ.. ప్రత్యేక స్థానం క్రేజ్ కొట్టేసింది. ఇక ఆ తర్వాత ఈ భామ నాగశౌర్యతో కలిసి ఒక మనసు అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ముద్దుల సీన్లలో మెగా డాటర్ రెచ్చిపోయి నటించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయం పక్కన బెడితే.. ఆ తర్వాత కూడా వెబ్ సీరిస్ లో నటిస్తూ... ప్రేక్షకులను అలరించింది.

ఇక అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ.. వెబ్ సీరిస్ లు.. అటు నిర్మాతగానూ నిహారికా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక ఈ క్రమంలో ఆమెకు చైతన్య జోన్నలగడ్డతో వివాహం జరిగింది. కానీ ఆ పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగానే నిలిచిపోయిది. వాళ్లు ఈ ఏడాది విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ విడాకులు విషయం నెట్టింట హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
అయితే నిహారిక విడాకులకు ఓ యూట్యూబర్ కారణం అంటూ.. వార్తలు వచ్చాయి. యూట్యూబర్ తో నిహారిక సన్నిహితంగా ఉండడం వల్లే నిహారిక భర్త తన మీద అనుమానపడి విడాకులకు అప్లై చేశాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. అంతే కాదు మెగా ఫ్యామిలీపైనా కూడా నెటిజన్స్ కొంత మంది దారుణంగా వ్యాఖ్యలు చేశారు. నిహారికకి ఆ యూట్యూబర్ కి మధ్య ఏదో నడుస్తుందని... త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు గుప్పుమన్నాయి.

నిహారిక యూట్యూబర్ ఎఫైర్ వార్తలకు ఒకే ఒక్క పోస్టుతో చెక్ పెట్టేసింది. నిహారిక ఇక నిహారికతో ఎఫైర్ ఉందంటూ వస్తున్న యూట్యూబర్ ఎవరో కాదు.. నిఖిల్ విజయేంద్ర సింహా. ఇతనికి నిహారికకు ఏదో ఉందంటూ గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. తాజాగా నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిహారిక ఒక పోస్ట్ చేసింది. అది నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

నిహారిక నిఖిల్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పింది.. నువ్వు మొదట్లో హోస్టుగా చేసి ఆ తర్వాత కో యాక్టర్ గా మారవు.. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి.. ప్రస్తుతం నా చిట్టి తమ్ముడిగా మారావ్.. మనం ఇంకా ఎంతో జర్నీ చేయాల్సి ఉంది.. ఎంతో మంచి మనసున్న వాళ్ళందరిలో నువ్వు కూడా ఒకడివి. లవ్ యు నిక్కీ హ్యాపీ బర్త్డే నానా అంటూ నిహారిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక చేసిన పోస్టులో నా చిట్టి తమ్ముడు అంటూ చెప్పడంతో వీరిద్దరి మధ్య వస్తున్న ఎఫైర్ వార్తలు చెక్ పడినట్లు అయింది.


Click it and Unblock the Notifications











