సైరా నర్సింహారెడ్డిలో మెగా డాటర్.. పాత్ర ఏంటంటే..
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. ఒక్క మనుసు చిత్రంలో నాగశౌర్యతో జతకట్టారు. వెబ్‌సిరీస్ ఇతర వ్యాపకాలతో బిజీగా మారారు. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారనే వార్త మీడియాలో కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. నిహారిక సైరాలో నటిస్తున్నట్టు తాజాగా తండ్రి నాగబాబు ధ్రువీకరించారు.
స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా సైరా నర్సింహరెడ్డి తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో మహిళా ఉద్యమకారిణిగా ఓ కీలక పాత్రను నిహారిక పోషిస్తున్నట్టు సమాచారం.

గతంలో ఈ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్‌ను పరిగణనలోకి తీసుకోగా, ఆ ఆలోచనను విరమించుకొని నిహారికను ఆ రోల్‌లో నటింపజేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











