Committee Kurrollu X Reiew: నిహారిక మూవీకి అలాంటి టాక్.. క్లైమాక్స్‌లో మెగా హీరో.. సినిమా ఎలా ఉందంటే!
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం చాలా కాలంగా కష్టపడుతోంది నిహారిక కొణిదెల. నటిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన ఆమె.. నిర్మాతగా మాత్రం కొత్త వాళ్లకు అవకాశాలను కల్పించడంతో పాటు ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందిస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో సక్సెస్‌లను కూడా చూసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా డాటర్ 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాను నిర్మించింది. పల్లెటూరి నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రానికి X (ట్విట్టర్)లో ఎలాంటి టాక్ వచ్చింది? నిహారిక హిట్ కొట్టిందా లేదా? అనేవి చూద్దాం పదండి!
కమిటీ కుర్రోళ్ళు వచ్చేశారు
పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ వచ్చిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని సమకూర్చారు.

అలాంటి కథతో వచ్చింది
గోదావరి జిల్లాకు చెందిన ఓ ఊరిలోని పరిస్థితులను ప్రతిబింబిస్తూ చూపించే సన్నివేశాలతో రూపొందిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. ఆ విలేజ్‌లోని పదకొండు మంది కుర్రాళ్లు రిజర్వేషన్ల కోసం ఎలా పోరాడారు? అసమానతలను ఎలా తొలగించారు? అనే అంశాలతో దీన్ని తెరకెక్కించారు. నిహారిక నిర్మించిన చిత్రం కావడంతో ఇది ఎన్నో అంచనాలతో విడుదల అయింది.
సందేశాత్మకమైన సినిమా
నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో 'కమిటీ కుర్రోళ్ళు స్నేహితులతో కలిసి చూడగలిగే వినోదాత్మక సినిమా. కులరహిత సమాజం, నగదు రహిత ఎన్నికల కోసం సందేశాన్ని జోడించిన తీరు బాగుంది. 90వ దశకంలో ఉన్న పరిస్థితులను చక్కగా చూపించిన తీరు బాగుంది' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్నీ చక్కగా కుదిరాయి
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రాన్ని చూసిన మరో నెటిజన్ 'కమిటీ కుర్రోళ్లు అనే సినిమా మంచి పెర్ఫార్మెన్స్, సరైన నటీనటుల ఎంపికతో వచ్చిన వినోదాత్మక చిత్రం. దీనికితగ్గట్లుగా మ్యూజిక్, విజువల్స్ ఉన్నాయి. టీమ్ వర్క్ మొత్తం చాలా బాగుంది. దీన్ని కచ్చితంగా చూడండి. నిహారిక, ఎస్సార్ స్టూడియో వాళ్లకు అభినందనలు' అంటూ చెప్పుకొచ్చారు.
మంచి సినిమా చూశాం
విలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ''కమిటీ కుర్రోళ్ళు' తెర మీద కనిపించినంత సేపు వాళ్ళలో మనల్ని కలుపుకుని నవ్విపించి, ఏడిపించి, ఎప్పుడో మన చిన్ననాటి జ్ఞాపకాలను, ఎక్కడో ఉన్న మన స్నేహితులను గుర్తుతెచ్చి, చివరికి ఒక మంచి సినిమా చూశాంరా అనే సంతృప్తితో బయటకు పంపిస్తారు' అని వివరించారు.
నిహారిక మంచి మూవీతో
యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీని చూసిన మరొక నెటిజన్ ట్విట్టర్‌లో 'ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు సినిమాను చూశాను. ఇది ఒక ఫీల్ గుడ్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్. నాకు బాగా నచ్చింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన నిహారిక, మూవీ టీమ్ మొత్తానికి థ్యాంక్యూ' అంటూ రాసుకొచ్చారు.
క్లైమాక్స్.. అలాంటి టాక్
నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. కొందరు అయితే ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్ ఓ మెగా హీరోను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇదే విధంగా మౌత్ టాక్ కూడా వస్తే 'కమిటీ కుర్రోళ్ళు' హిట్ కొట్టే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











