నాగబాబు కూతురు నిహారిక అలా ఎంట్రీ ఇస్తోందా?
హైదరాబాద్: నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ‘ముకుంద' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హెడ్గే హీరోయిన్. లియో ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు.
ఇక నాగ బాబు కూతురు నిహారిక విషయానికొస్తే ఈమె కూడా త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఆమె వచ్చేది నటిగా కాదని, నిర్మాతగా అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. అంజనా ప్రొడక్షన్స్ తరుపున నిర్మాతగా ఆమె త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

‘ఆరెంజ్' సినిమా భారీ ప్లాప్ కావడంతో నాగబాబు తీవ్రంగా నష్టపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అసలు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఒక్క సినిమా కూడా తీయలేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ఆరెంజ్ మిగిల్చిన నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాగబాబు త్వరలో తన కూతురు నిహారిక నిర్మాతగా సినిమాలు తీయడం ప్రారంభిచే యోచనలో ఉన్నాడట.
నిహారిక ఇపుడు టాలీవుడ్లో సరికొత్త సెల్రబిటీ. అంతా ఆమె హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 'ఢీ'-7 యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాకరింగుతో, బబ్లీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్ అంటూ కితాబిస్తున్నారు.


Click it and Unblock the Notifications











