Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల రెండో పెళ్లి, పిల్లలు అంటూ చెప్పుకువచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. నిహారిక రెండో పెళ్లంటూ మాట్లాడిన అనంతరం.. ఆమె మాజీ భర్త చైతన్య జోన్నలగడ్డ వరుసగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మొన్న నిశ్శబ్దం, మౌనం అంటూ రాసుకువచ్చిన చైతన్య.. ఇప్పుడు మరో కవితను పోస్ట్ చేశాడు. అసలు ఆ పోస్టులో ఏముంది.. ఎవరికోసం పెట్టారు అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ ల్లో నటించింది. నాన్న నాగబాబుతో కలిసి పలు చిన్న సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వెండితెరపై ఒక మనసు అంటూ ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్యతో కలిసి ముద్దులతో రెచ్చిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత సూర్యకాంత, హ్ాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.

ఇక వెండితెరపై అంతగా నిహారిక క్లిక్ కాలేదు. దీంతో వెబ్ సిరీసుల బాట పట్టింది. ఇక పెద్దల సమక్షంలో చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు.. వీడిపోతున్నట్లు ప్రటించారు. ఇక విడాకుల తర్వాత చాలా రోజులకు ఓ పాడ్ కాస్ట్ లో నిహారిక ఓపెన్ గా మాట్లాడింది. ఇక ఇటీవల సైతం ఓ ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకువచ్చింది. అంతేనా పిల్లలను సైతం కంటాను అని వెల్లడించింది.
నిహారిక రెండో పెళ్లంటూ చెప్పుకువచ్చిన తర్వాత ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ నెట్టింట్లో యాక్టివ్‌గా మారిపోయారు. నిహారిక, చైతన్యల విడాకుల తరువాత ఇద్దరూ ఎవరి ప్రపంచంలో వారు బిజీగా ఉండగా.. నిహారిక రెండో పెళ్లంటూ ప్రకటించిన అనంతరం చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయాడు. వరుసగా పోస్టులు చేస్తున్నాడంగా.. అవన్నీ నిహారిక కోసమేనని అంటున్నారు నెటిజన్స్..
తాజాగా చైతన్య తనకు నచ్చిన, మెచ్చిన సూక్తులను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశాడు. మొన్న నిశ్శబ్దం అంటూ ఆయన చెప్పిన పొయెట్రీ నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఆత్మ గురించి ఓ పాజిటివ్ పొయెట్రీని రాసుకువచ్చాడు. ప్రకృతి, ఆత్మ, దైవం అంటూ ఇలా చైతన్య తనకు నచ్చినట్టుగా కవిత్వం రాసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదంతా కూడా ఇన్ స్టాగ్రాంలో కాస్త పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమని ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం చైతన్య పోస్ట్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











