twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాడ్ ఫాదర్ ఉన్నా కూడా ఆడవారికి అలాంటివి తప్పవన్న మెగా డాటర్

    |

    ఇండస్ట్రీలో కొత్త వారు ఎదగాలంటే.. కాస్త సమయం పట్టొచ్చు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆడవారికి మాత్రం మగవారితో సమానంగా అవకాశాలు ఉండవు.. గాడ్ ఫాదర్ ఉన్నా, ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఆడవారికి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయని మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలిపింది.

    మెగా ఫ్యామిలీ నుంచి హీరోల పరంపర కొనసాగుతూ ఉండగా.. మొట్టమొదటి సారి దాన్ని బ్రేక్ చేసి.. ఓ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే మెగా హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం వచ్చింది.. కానీ, ఇంతవరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. చేసిన ప్రతిసినిమా డిజాస్టర్‌గానే మిగిలింది. తమిళంలో కూడా ట్రై చేసినా.. విజయాన్ని దక్కించుకోలేకపోయింది.

    అయితే వెబ్ సీరిస్‌లో నిహారిక సక్సెస్ అయింది. ముద్దపప్పు ఆవకాయ్ అంటూ తీసిన వెబ్ సిరీస్ బాగానే క్లిక్ అయింది. దీంతో అటు వైపు దృష్టి పెట్టిన నిహారిక.. నాగబాబుతో కలిసి నాన్నకూచి అని మరో సిరీస్‌ను తెరకెక్కించింది. వెండితెరపై మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోలేకపోతోంది. ఇటీవలె సైరా సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.

    Niharika Konidela Forbes Interview Goes Viral

    రీసెంట్‌గా ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ అమ్మాయి తనను తాను నిరూపించుకోవడానికి.. ఓ అబ్బాయికి ఇచ్చిన స్వేచ్చ, అతనిపై ఉన్న నమ్మకాన్ని ఆమెపై పెట్టుకోలేరు.. అది అసాధ్యం.. అలా అమ్మాయినికి చాన్స్ ఇవ్వకపోవడంలో ఎలాంటి కారణం ఉండదంటూ చెప్పుకొచ్చింది. ఓ అమ్మాయికి గాడ్ ఫాదర్ ఉన్నంత మాత్రాన అన్ని సులభంగానే జరిగిపోతాయనే దాంట్లో నిజం లేదంటూ తన మనసులోని భావాలను ఫోర్బ్స్‌తో పంచుకుంది.

    English summary
    Niharika Konidela Forbes Interview Goes Viral. She Sai That Having a godfather in the industry might not necessarily make things easy for women Actor-producer niharikakonidela, daughter of (actor-producer) Nagendra Babu and niece of Telugu superstar Chiranjeevi, shares her experience
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X