నేను హాట్‌గా ఉంటానంటూ సర్టిఫై చేసేశాడు.. నిహారిక కామెంట్స్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తరువాత జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మెగా ఇంట్లో ప్రిన్నెస్‌లా పెరిగిన నిహారిక.. అత్తింట్లోనూ రాజభోగాలు అనుభవిస్తోన్నట్టు తెలుస్తోంది. తన అత్తగారు అసలు పనులేవీ చెప్పదని, ఆకలేస్తోందంటే ముద్దలు కలిపి తినిపిస్తుందంటూ నిహారిక చెప్పుకొచ్చింది. అలా అత్తింట్లో నిహారిక ఎంతో సంతోషంగా ఉందని తెలుస్తోంది. తాజాగా నిహారిక ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ తన అభిమానులకు, ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే ఉంటుంది. ఈ మధ్య నిహారిక కాలికి గాయమైన విషయం తెలిసిందే.

కాలికి గాయమవ్వడంతో..
నిహారిక కాలికి గాయం అవ్వడంతో ఓ రెండు మూడు రోజులు ఇంటికి పరిమితమైంది. అందులోనూ కాలికి పెద్ద పట్టి వేయడంతో బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చినట్టుంది. అందుకే తన శ్రీవారు సేవలు చేస్తున్నారంటూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

అలా సేవలు..
నిహారిక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పగలు రాత్రి అని తేడాలేకుండా ఆ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనే ఉంటోంది. అయితే అక్కడే నిహారిక కాలికి గాయమైందని తెలుస్తోంది. అలా నిహారికకు గాయం అవ్వడంతో ఆమెకు చైతన్యనే సేవలు చేశాడు. టిఫిన్, ట్యాబెట్లు, స్పా చేయడం వంటివన్నీ సేవలు చేశాడట.

తాజాగా అలా..
నిహారిక తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ బుడ్డోడితో నిహారిక ఆట ఆడింది. తాను హాటీయా? బ్యూటీయా? అంటూ పిల్లాడిని ప్రశ్నించింది. దానికి ఆ పిల్లోడు హాటీ అంటూ క్యూట్‌గా బదులిచ్చాడు. అలా బదులిచ్చిన వెంటనే మళ్లీ నిహారిక.. కేవలం హాటీనా? బ్యూటీ కాదా? అని అడిగింది.

సర్టిఫై చేసేశాడు..
అలా నిహారిక మళ్లీ అడగడంతో ఆ బుడ్డోడు క్యూట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో తాను ఇప్పుడు సర్టిఫైడ్ హాట్ అని చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











