అంతా జరిగిపోయాక.. కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుతో కొట్టినట్లు నిహారిక సమాధానం!
Recommended Video

మెగా డాటర్ నిహారిక నటించిన తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రంలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎప్పుడూ చలాకీగా ఉండడం నిహారిక ప్రత్యేకత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయం వెల్లడించింది. తమ కుటుంబంపై మెగా అభిమానుల్లో ఉన్న అభిమానం ప్రత్యేకమైనదని నిహారిక తెలిపింది.

చాలా విన్నా
కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందనడం సరైంది కాదని నిహారిక తెలిపింది. అన్ని రంగాల్లో ఇలాంటి విషయాల గురించి తాను విన్నానని, కొన్ని తనకు తెలుసు అని నిహారిక తెలిపింది.

సమ్మతం లేకుండా
ఏది ఏమైనా మన సమ్మతం లేకుండా ఎవడూ ఏమీ చేయలేడు. అయినా కూడా అలా చేశారు అని అంటే అది లైంగిక వేధింపులు లేదా అత్యాచారంగా పరిగణించాలని నిహారిక తెలిపింది. అంతా జరిగాక.. వాళ్ళు ఆలా చేశారు..వీళ్ళు ఇలా చేసారు అని చెప్పడం సరైంది కాదు. మీరు ఓకే చెప్పకుండా ఎవ్వరూ లాక్కుని వెల్లిపొరని నిహారిక తెలిపింది.

మరో మార్గం లేకపోతే
కానీ మాకు ఈ మార్గం తప్ప మరో దారి లేదు అంటే దాని గురించి మాట్లాడడం కష్టం. నేను వచ్చిన నేపథ్యం వేరు కాబట్టి వారి కోణంలో ఆలోచించలేను అని నిహారిక తెలిపింది.

గ్లామర్
తమ కుటుంబాన్ని ప్రేమించే అభిమానులు కోట్లాదిమంది ఉన్నారు. నేను సినిమాల్లోకి వస్తునానంటే వాళ్ళ సొంత చెల్లి, కూతురు వచ్చినట్లుగా అభిమానులు భావిస్తారు. మాపై ఉన్న అభిమానం అది. కాబట్టి నేను ఎలా పడితే అలా గ్లామర్ రోల్స్ చేయలేను. అలా అని నేను ఎదో కోల్పోవడం లేదు. గ్లామర్ విషయంలో కూడా ఓ పరిధి వరకే ఉండాలని భావిస్తున్నాను అని నిహారిక తెలిపింది.


Click it and Unblock the Notifications











