ఇండియన్ సినిమా ప్రైడ్ ను హగ్ చేసుకున్నానంటోన్న మెగా డాటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసింది. చిరు చేసిన 150 సినిమాలు ఒకెత్తు అయితే సైరా ఒకెత్తు అని యావత్ తెలుగు సినీ ప్రపంచం కీర్తిస్తోంది. తొలి స్వతంత్ర్య సమర యోధుడు, రేనాటి వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది.

మెగా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా

మెగా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను గౌరవించి, ఆయనకు నివాళిగా తెరకెక్కించిన రామ్ చరణ్.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చెప్పినట్లుగానే.. ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందని కాదు.. ఓ గౌరవాన్ని పెంచుతుందని తీశామని ఎంతో భావోద్వేగంగా చెప్పాడు. నిజంగా ఇప్పుడు ఉయ్యాలవాడ వీరుడి గురించి ప్రపంచానికి తెలిసింది. దాదాపు 300 కోట్లతో తెరకెక్కించిన సైరా.. అద్భుతమైన కలెక్షన్లు సాధింస్తుడటమే కాకుండా.. అందరికీ ఎంతో గౌరవాన్ని తీసుకొస్తుంది.

Recommended Video

Chiranjeevi Speech At Sye Raa Narasimha Reddy Success Meet | మహేష్ బాబు,రాజమౌళి కి చాలా నచ్చింది!!
టాలీవుడ్ మొత్తం సైరా అంటోంది..

టాలీవుడ్ మొత్తం సైరా అంటోంది..

మన తెలుగు వాడి ఖ్యాతిని పెంచే విధంగా, టాలీవుడ్ స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తెరకెక్కించిన సైరాకు సినీ అభిమానులే కాదు.. టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం సైరా అంటోంది. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు అందరూ సినిమాను ప్రశంసిస్తున్నారు.

సంబరాల్లో మెగా ఫ్యామిలీ

సంబరాల్లో మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ మొత్తం ఖుషీలో ఉన్నట్టుంది. నిర్మాతగా రామ్ చరణ్ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించడం ఒకటైతే.. టాలీవుడ్ చరిత్రలో మిగిలి పోయే సినిమాలో చిరంజీవి తన నట విశ్వ రూపాన్ని చూపడం మరొకటి. ఇలా రెండు గొప్ప విజయాలు వచ్చే సరికి మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగినట్టు తెలుస్తోంది.

సైరాలో చిన్న పాత్రతో మెరిసిన మెగా డాటర్..

సైరాలో చిన్న పాత్రతో మెరిసిన మెగా డాటర్..

చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర చేసినా గొప్పే.. అసలు అలాంటి లక్కీ చాన్స్ రావాలని కోరుకోని వారేవరుంటారు. అలా ఆ లక్కీ చాన్స్ నిహారికకు రావడం.. సైరా లాంటి చారిత్రాత్మక సినిమాలో భాగం కావడం.. సినిమా ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిహారికి ఆనందానికి అవధుల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

నేను హగ్ చేసుకుంది డాడీని కాదు.. ఇండియన్ సినిమా ప్రైడ్ ను

నేను హగ్ చేసుకుంది డాడీని కాదు.. ఇండియన్ సినిమా ప్రైడ్ ను

ఇక ఆ ఆనందాన్ని మెగాస్టార్ తో కలిసి పంచుకుంది. నిహారిక, వరుణ్ చిరును డాడీ అని పిలుస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నేను హగ్ చేసుకుంది మా డాడీని కాదు.. ఇండియన్ సినిమా ప్రైడ్ ను, ఎప్పటీకీ మెగాస్టార్ ఫ్యాన్ నే.. లవ్యూ డాడీ.. బాస్ బస్టర్ హిట్ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసి.. ఇప్పటికే సైరా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X