twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిహారిక భర్త చైతన్య కేసులో అలాంటి ట్విస్టు.. క్లైమాక్స్‌లో తేలిందేమిటంటే!

    |

    మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ నివసించే అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవ తెలుగు మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చిన్నపాటి ఘర్షణ గొడవగా మారడం, ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసుకోవడం మీడియాలో రచ్చగా మారింది. అయితే నిహారిక భర్త చైతన్య, అపార్ట్‌మెంట్ వాసుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు దర్యాప్తు చేయగా బయటకు వచ్చిన పలు విషయాలు ఏమిటంటే...

    తప్పు ఎవరిదనే విషయంపై

    తప్పు ఎవరిదనే విషయంపై

    చైతన్య జొన్నలగడ్డ, అాపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదులు స్వీకరించిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి అక్కడ గొడవ గురించి అడిగి తెలుసుకొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో జరిగిన గొడవను పరిశీలించారు. ఈ కేసులో తప్పు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారించారు. ఇంకా కేసు దర్యాప్తు సమయంలో పలు విషయాలను పోలీసుల గోప్యంగా ఉంచారు.

    ఫిర్యాదులపై విచారణ

    ఫిర్యాదులపై విచారణ

    అపార్ట్‌మెంట్‌లో చైతన్య, నివాసితులకు జరిగిన గొడవకు సంబంధించిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో వాస్తవాన్ని బయటకు లాగేందుకు బంజారా హిల్స్ ఫోలీసులు దర్యాప్తు చేశారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఏడుగురు రెసిడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తూ.. వారిని కూడా విచారించారు. వాస్తవాల ఆధారంగా గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ.. సమాచార లోపం వల్ల గొడవ జరిగిందనేది గ్రహించారు.

    సమాచారం లోపంతోనే గొడవ అంటూ

    సమాచారం లోపంతోనే గొడవ అంటూ

    ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన గొడవలో నిహారిక, చైతన్య దంపతులను తప్పు పట్టాల్సిన సంఘటనలు పోలీసుల దృష్టికి రాలేదనేది తాజా సమాచారం. పార్టీ తర్వాత చైతన్య స్నేహితులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని, అంతే మొత్తంలో అపార్ట్‌మెంట్ వాసులు స్పందించడంతో వాగ్వాదం చోటుచేసుకొన్నదనే విషయం సీసీటీవీ పుటేజ్‌లో స్పష్టమైంది. అయితే ఇరువర్గాలది తప్పు ఉండటంతో అంతర్గతంగా అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రాజీ చేసేందుకు ప్రయత్నించారు అని తెలిసింది.

    రాజీ ప్రయత్నాలతో కేసు ముగింపు

    రాజీ ప్రయత్నాలతో కేసు ముగింపు


    అయితే అపార్ట్‌మెంట్ వాసులకు, నిహారిక దంపతులకు మధ్య అవగాహన లోపంతో గొడవ జరిగింది. అయితే ఇరుపార్టీలు కూడా రాజీకి రావడంతో కేసు మూసివేసే దిశగా ప్రయత్నాలు జరిగాయి. మీడియాలో రావడంతో ఈ వ్యవహారంపై మరింత అటెన్షన్ పెరిగింది. ఈ కేసు సెలబ్రిటీలతో ముడిపడి ఉండటంతో కొంత సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ కేసును తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

    Recommended Video

    Tollywood లో Anirudh Ravichander హవా, అదొక్కటే ఛాలెంజ్..| NTR 30 || Filmibeat Telugu
    చైతన్య వివరణతో హ్యపీ ఎండింగ్

    చైతన్య వివరణతో హ్యపీ ఎండింగ్

    అపార్ట్‌మెంట్‌లో గొడవ జరిగిన తర్వాత చైతన్య వివరణ ఇవ్వడంతో ఈ కేసు ముగింపు దిశగా అడుగులు పడ్డాయి. అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు మాకు సమాచార లోపం వల్ల ఈ గొడవ జరిగింది. 25 మంది అపార్ట్‌మెంట్ వాసులు మా ఫ్లాట్‌కి వచ్చి గొడవపడటంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మేము తీసుకొన్న ఫ్లాట్‌ను ప్రొడక్షన్ హౌజ్ కోసం వాడుకోవడంతో కొందరు అభ్యంతరం తెలిపారు. కమర్షియల్‌ అవసరాలకు ఇవ్వమని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. దాంతో అగస్టు 10న ఖాళీ చేస్తామని యజమానితో చెప్పాం అని చైతన్య క్లారిటీ ఇచ్చారు. దాంతో ఇరుపార్టీల మధ్య వివాదం ముగిసిపోయింది అంటూ పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో కేసు క్లోజ్ దిశగా అడుగులు పడ్డాయనే విషయం బయటకు వచ్చింది.

    English summary
    Mega Daughter Nikarika Konidela Husband Chaitanya Jonnalagadda Nuisance Case closed. Then His Also Gave Complaint at Banjara Hills Police Station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X