ఎవరూ లవ్ ప్రపోజ్ చేయడం లేదు.. ఆ కారణంగానే ప్రేమించడం లేదు.. నిహారిక
Recommended Video

సాధారణంగా సినీ కుటుంబంలో నుంచి కేవలం హీరోలే వస్తారు. హీరోయిన్లు రావడమనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ అలాంటి అడ్డంకులను ఎదుర్కొని వచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఒకరు. ఒక్కమనసు చిత్రంతో నిహారిక తెలుగు తెరకు పరిచయమై విమర్శల ప్రశంసలు అందుకొన్నారు. ప్రస్తుతం మెగా డాటర్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

ప్రేమ గురించి నిహారిక
మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా తాను సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యామిలీ కారణంగా నిహారికను ఎవరు ప్రేమించడం లేదు అని ఆమె చెప్పారు.

నా ఫ్యామిలీ కారణంగానే
నా కాలేజ్ రోజుల నుంచి కూడా చూస్తున్నాను, ఎవరైనా నాకు లవ్ లెటర్ ఇస్తారేమో అని. ఒకవేళ ఇస్తే దానిని నా మొదటి లవ్ ప్రపోజల్‌గా దాచుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పటి వరకు నాకు ఏ ఒక్కరు కూడా లవ్ ప్రపోజల్ చేయలేదు. ప్రేమపై పెద్దగా ఆసక్తి లేకున్నా కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుండని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానను నిహారిక వెల్లడించారు.

కుర్రాళ్లు భయపడుతున్నారు
తన వెనుక ఉన్న ఫ్యామిలీ వల్లే తనను లవ్ చేసేందుకు కుర్రాళ్లు బయపడుతున్నారు. నన్ను ఎవరు కూడా తనకు ప్రపోజ్ చేయకపోవడంతో అసలు అందంగా ఉంటానా అనే అనుమానం నాకే కలిగింది. కొంచెం అందంగా కూడా ఉండనా అంటూ నాపై నాకే అనుమానం వేస్తుంది అని నిహారిక పేర్కొన్నారు.

ఇళయరాజా పాటలంటే ఇష్టం
సినీ పరిశ్రమలో కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా ఆశ. నాకు ఇళయరాజా, ఏఆర్ రెహ్మన్ సంగీతం అంటే చాలా ఇష్టం. అభినందనలో అదే నేను పాట నాకు చాలా ఇష్టం.


Click it and Unblock the Notifications











